Site icon NTV Telugu

Youth: ఒక రోజు ఆలస్యంగా థియేటర్స్‌లో ‘యూత్’ సందడి!

Youth

Youth

Youth: తమిళ్‌లో మంచి సక్సెస్ సాధించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘యూత్’ (Youth) తెలుగు విడుదలకు సంబంధించి ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విడుదలకు కేవలం కొన్ని గంటల ముందు మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళ నటుడు కరుణాస్ కుమారుడు కెన్ కరుణాస్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా యూత్. ఈ సినిమాను తెలుగులో E2C టాకీస్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను ఒక రోజు ఆలస్యంగా, అంటే మార్చి 27న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

READ ALSO: Kalki 2: మహాభారత పర్వం పీక్స్.. 20 ని. గూస్‌బంప్స్ అంతే!

సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా, మేకర్స్ కొన్ని ప్రత్యేక షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. విడుదల తేదీ మారినప్పటికీ, సినిమాపై ఉన్న బజ్ ఏమాత్రం తగ్గలేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమాలో కెన్ కరుణాస్, దేవదర్శిణి, సూరజ్ వెంజరమూడు, అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ తదితరులు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాల్సిందే.

READ ALSO: Puri Jagannath Ratna Bhanda: పూరీ జగన్నాథుడి ‘రత్న గర్భం’ గుట్టు వీడనుంది.. 48 ఏళ్ల తర్వాత తెరుచుకున్న నిధుల గది!

Exit mobile version