Site icon NTV Telugu

Cricket Betting: ప్రాణాలు తీసిన క్రికెట్‌ బెట్టింగ్‌.. కాకినాడలో యువకుడి ఆత్మహత్య

Cricket Betting

Cricket Betting

Cricket Betting: సందర్భం ఏదైనా సొమ్ము చేసుకోవడమే బెట్టింగ్‌ రాయుళ్ల పని.. అది ఎన్నికల సీజన్‌ అయినా.. క్రికెట్‌ సీజన్‌ అయినా.. ఇక, ఐపీఎల్‌ షురూ అయ్యిందంటే బెట్టింగ్‌ రాయుళ్లకు పండగే.. కొన్ని సార్లు పోలీసుల రైడ్స్‌ జరిగినా.. కేసులు పెడుతున్నా.. అరెస్ట్‌లు చేసినా.. చాలా ప్రాంతాల్లో గుట్టుగా.. ఈ వ్యవహారం సాగుతూనే ఉంది.. బెట్టింగ్‌ బారినపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కాకినాడ జిల్లాలో కలకలం రేపుతోంది.. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. క్రికెట్‌ బూకీల నుంచి బెదిరింపులు రావడంతో భయంతో అనిల్ కుమార్ అనే యువకుడు సూసైడ్‌ చేసుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.. కరప మండలం వేళంగికి చెందిన అనిల్ కుమార్.. రామచంద్రపురంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు.. క్యాటరింగ్ పనులు చేసే అనిల్‌.. క్రికెట్‌లో బెట్టింగ్‌ పెట్టేవాడు.. కొన్నిసార్లు డబ్బులు వచ్చినా.. చాలా సార్లు డబ్బులు పోగొట్టుకున్నాడు.. క్రికెట్‌ బెట్టింగ్‌ల కోసం ఏకంగా రూ. 2 లక్షలకు పైగా అప్పులు కూడా చేశాడు.. ఓవైపు అప్పుల వాళ్ల వేధింపులు.. మరోవైపు క్రికెట్‌ బుకీల నుంచి బెదిరింపులు రావడంతో.. అనిల్‌ కుమార్‌ బలవంతంగా ప్రాణాలు వదిలాడు.

Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. కారు ఢీకొని ముగ్గురు మృతి

Exit mobile version