Site icon NTV Telugu

AI Summit: కాంగ్రెస్ కార్యకర్తలను చితక్కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్..

Congress (1)

Congress (1)

AI Summit: ప్రపంచ వేదికపై భారతదేశ పరువు పోయే విధంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవర్తించారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సమావేశంలో ఊహించని సంఘటన జరిగింది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు తమ టీ షర్టుల్ని తీసేసి, నినాదాలు చేశారు. ఏఐ ఎక్స్‌పో హాల్‌లోకి ప్రవేశించి, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌ను ఉద్దేశిస్తూ, టీషర్టులు ప్రదర్శించారు. ప్రధాని మోడీ ట్రంప్‌నకు లొంగిపోయారని అన్నారు.

Read Also: Accenture: ప్రమోషన్ కావాలంటే AI వాడాలి.. ఉద్యోగులకు యాక్సెంచర్ వార్నింగ్..

ఈ సంఘటన తర్వాత, సెక్యూరిటీ సిబ్బంది వారిని బయటకు తీసుకెళ్లింది. పోలీస్ వర్గాల ప్రకారం, పక్కాగా ప్లాన్ ప్రకారమే ఇలా చేశారని చెబుతున్నారు. ఈ ఘటనలో 10 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా గుర్తించి పట్టుకుంటామని తెలిపారు. అరెస్టయిన వారిలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కృష్ణహరి, నేషనల్ కోఆర్డినేటర్ నరసింహ యాదవ్, బీహార్ కాంగ్రెస్‌కు చెందిన కుందన్ యాదవ్, యూపీకి చెందిన అజయ్ కుమార్ ఉన్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. భారత పరువు తీసేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తుందని బీజేపీ నేతలు భూపేందర్ యాదవ్, ప్రదీప్ భండారి లాంటి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఏఐ సమ్మిట్‌కు హాజరైన సాధారణ ప్రజలు నిరసన తెలపుతున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని చితక్కొట్టారు. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై రాజకీయాలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న వారిని పరిగెత్తించారు. కాళ్లకు, చేతులకు పని చెప్పారు. కాంగ్రెస్‌కు బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version