NTV Telugu Site icon

Drunken Drive : బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో యువకుడి వీరంగం

Drunken Drive

Drunken Drive

నిషా నెత్తికెక్కి ఏం చేస్తారో తెలియదు కొందరికి. అలాంటి సంఘటనే నిన్న రాత్రి బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. మద్యం సేవించి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులుపై దాడికి యత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న రాత్రి బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఓ యువతితో పాటు కారులో వచ్చిన యువకుడిని పోలీసులు ఆపారు. అతడు మద్యం సేవించినట్లు గుర్తించి బ్రీత్ అనలైజ్ చేయాలని అడిగారు. అందుకు యువకుడు నిరాకరించాడు. తాను తాగలేదని.., బ్రీత్ అనలైజ్ ఎందుకు చేయాలని పోలీసులపై తిట్లదండకం అందుకున్నాడు. అంతేకాకుండా.. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ ట్రాఫిక్ ఎస్సైతో దుర్భాషలాడాడు మందుబాబు. నీకు సెక్షన్లు తెలుసా? ఐపీసీ సెక్షన్ 123 కింద నీపై కేసు ఫైల్ చేస్తానంటూ హెచ్చరిస్తూ ఎస్సైని కాలితో తన్నాడు.

Also Read : Undavalli Arun Kumar: ఏపీ విభజన కేసు.. ఇది శుభపరిణామం

యువకుడి పక్కన ఉన్న యువతి సైతం రెచ్చిపోయి ప్రవర్తించింది. వీడియోలు తీస్తారా? మీకు సిగ్గు లేదా? అంటూ మాట్లాడింది సదరు యువతి. దీంతో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మందుబాబుకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులు.. వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌ తరలించారు ట్రాఫిక్‌ పోలీసులు. దీంతో.. మందుబాబు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే పోలీసులపై హద్దుమీరి ప్రవర్తించిన యువకుడిని ఆహా ఓటీటీలో పనిచేస్తున్న గౌరవ్ గుర్తించారు. బ్రీత్ అనలైజ్ పరీక్షలలో 94bac పాయింట్లు రావడంతో కేసు నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు.

Also Read : Pinarayi Vijayan : బీజేపీ అధికార దుర్వినియోగానికి మనీష్ సిసోడియాను అరెస్టు నిదర్శనం