NTV Telugu Site icon

Tadepalli: పెళ్లికి అంగీకరించలేదని యువతిపై బ్లేడుతో ప్రేమోన్మాది దాడి

Tadepalli

Tadepalli

Tadepalli: రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. పోలీసులు ఎన్ని రకాలుగా చట్టాలు తీసుకొచ్చినా.. దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నా మహిళలు, యువతులు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. హత్యలు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నర్సుగా పని చేస్తున్న కావ్య(23) అనే యువతిపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కావ్యకు గాయాలు అయ్యాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన కావ్య తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం కావ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు.

Read Also: Illicit Relationship: మహిళా ఎస్సైతో ఎస్సై రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. చివరకు?

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన కావ్య ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో మూడేళ్లగా నర్సుగా విధులు నిర్వహిస్తోంది. హాస్టల్‌లో ఉంటూ నర్సుగా పనిచేస్తోంది. ఆదివారం సెలవు కావడంతో హాస్టల్‌లోనే ఉంది. ఈ క్రమంలో హాస్టల్‌లో ఉన్న కావ్యను మాట్లాడాలి అని కిందకి పిలిచి బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది క్రాంతి. తాను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని క్రాంతి యువతిని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన క్రాంతి.. తన వద్ద ఉన్న బ్లేడుతో యువతి మెడపై దాడి చేశాడు. భయంతో క్రాంతిని నెట్టే క్రమంలో కావ్య చేతిపైన గాయాలయ్యాయి. యువకుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంటర్ నుంచి కావ్యతో క్రాంతికి పరిచయం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రేమ నిరాకరించటమే కావ్యపై క్రాంతి దాడికి కారణంగా పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన క్రాంతిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Show comments