2024 పార్లమెంట్ ఎన్నికల్లో, 4 యువ ఎంపీలు సీనియర్ నేతలపై విజయం సాధించి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. వీరు తమ అత్యుత్తమ ప్రదర్శనతో సత్తా చాటి చిన్న వయస్సులోనే ఎంపీలుగా ఘనత సాధించారు. బీహార్ సమస్తిపూర్ నుంచి నితీష్ కుమార్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన అశోక్ చౌదరి కుమార్తె శశాంభవీ చౌదరి(25) 1,87,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాజస్థాన్‌లో భరత్పూర్ నుంచి సంజన జాతవ(25) 51,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. యూపీలోని కౌసాంబినుంచి సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసిన పుష్పేంద్ర సరోజ(25) లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ ఎంపీ బోలా నాథ్‌పై 30,000 ఓట్ల మెజారిటీతో సమాజ్వాదీ పార్టీ తరపున ప్రియా సరోజ(25) విజయం సాధించారు.