NTV Telugu Site icon

IPL 2025 Mega Auction: ముంబైకి ఆడనున్న యువ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్.. ఎన్ని కోట్లు పెట్టారో తెలుసా..?

Allah Ghazanfar

Allah Ghazanfar

స్ట్రాంగ్ బౌలింగ్ కోసం ముంబై ఇండియన్స్ (MI) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్‌ను కొనుగోలు చేసింది. అతని కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ మిస్టరీ స్పిన్నర్‌ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు ముంబై ఇండియన్స్ ఇతన్ని సొంతం చేసుకుంది. గత సంవత్సరం గజన్‌ఫర్ కేకేఆర్‌లో ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడనున్నాడు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కర్ణ్ శర్మ తర్వాత ముంబై క్యాంపులో అతను రెండవ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చేరాడు.

Read Also: Paperless legislative system: ఇక, పేపర్ లెస్ శాసన వ్యవస్థ.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో ఒప్పందం..

మెగా వేలంలో రూ. 50 లక్షలతో బేస్ ప్రైస్ తో ఉండగా.. అతని కోసం పోటాపోటీగా బిడ్డింగ్ జరగడంతో భారీ ధరకు రూ. 4.80 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. పాక్టియాలో జన్మించిన ఘజన్‌ఫర్ ఇంతవరకు ఐపీఎల్ లో ఆడలేదు. అతని కెరీర్‌లో ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లలో.. రెండు ఫోర్-వికెట్ల హాల్‌లతో 29 వికెట్లు తీసుకున్నాడు. 8 వన్డేలు ఆడి 4.36 ఎకానమీ రేటుతో 12 వికెట్లు తీశాడు.

Read Also: Maharashtra Next CM: ఏక్‌నాథ్ షిండే మళ్లీ సీఎం కావడానికి ఈ 6 కారణాలను వివరించిన శివసేన!