NTV Telugu Site icon

Happy Birthday Rebel Star Prabhas : ప్రభాస్ కు ఆ డైరెక్టర్ అంటే ఇష్టమట.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్

Prabhas

Prabhas

Happy Birthday Rebel Star Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరు అంటే తెలియని వారు ఉండరు.. బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రభాస్. ఆ తర్వాత ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించాడు. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. రీసెంట్‌గా నటుడిగా 20 యేళ్లు పూర్తి చేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే ప్రభాస్ ఏ ఏ సినిమాలు చేశాడు? ఎంత క్రేజ్ సంపాదించాడు అనే విషయాలు దాదాపుగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగర్.. నేడు ప్రభాస్ పుట్టినరోజు.

ప్రభాస్ కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి, సూర్యనారాయణ రాజు దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు కాగా మొదటి సంతానంగా ప్రభోధ్ జన్మించారు. ఆ తర్వాత ప్రభాస్ కి ఒక సోదరి కూడా ఉన్నారు ఆవిడ పేరు ప్రగతి, అయితే ఈ ముగ్గురిలో ప్రభాస్ చిన్నవాడు. భీమవరంలో డిఎన్ఆర్ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేశారు.

Read Also: Sanjay Dutt: బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్

ప్రభాస్ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ‘ఈశ్వర్’ సినిమాకు క్లాప్ కొట్టారు దివంగత కృష్ణంరాజు. ఏ ముహూర్తానా పెదనాన్న ఆశీర్వాదంతో సినీ రంగంలో ప్రవేశించాడో హీరోగా వెనుదిరిగి చూసుకోలేదు. తర్వాత రాఘవేంద్ర సినిమాతో వచ్చినా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఆ తర్వాత శోభన్ దర్శకత్వంలో వర్షం సినిమాలో నటించాడు. సినిమాతో అటు అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టడమే కాదు.. మాస్‌ ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు ప్రభాస్‌.

Read Also:Husband Killed Neighbour: భార్యభర్తల మధ్య ‘చికెన్’ గొడవ.. మధ్యలో వెళ్లిన వ్యక్తి హత్య

20ఏళ్ల కెరీర్‌లో పందొమ్మిది సినిమాలు చేసిన రెబల్ స్టార్ ప్రభాస్. ఒక పక్క మిస్టర్ ఫర్ఫెక్ట్‌గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తూనే.. మరో పక్క మిర్చిలా రికార్డుల ఘాటును పెంచారు. రెబల్ స్టార్ ప్రతి సినిమాకు ఫ్రెష్ లుక్‌లో కనిపించడానికి ప్రయత్నిస్తాడు. ఒక రకంగా మంచి హిట్స్ లో ఉండగా రాజమౌళి చెప్పిన బాహుబలి కథ విని దాదాపుగా ఆ కథ కోసం రెండు మూడు ఏళ్లు వెచ్చించారు ప్రభాస్. అలా సుమారు 600 రోజులు బాహుబలి షూటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సీక్వెల్ కోసం మరో రెండేళ్లు వెచ్చించడంతో ఇలా తన కెరియర్లో దాదాపు ఐదేళ్లు కేవలం బాహుబలి కోసమే వెచ్చించారు. రాజమౌళి దర్శకత్వంలో మొత్తం మూడు సినిమాలు చేశారు ప్రభాస్.

ప్రభాస్ ఒక బాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రలో కూడా కనిపించిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ప్రభాస్ వ్యాక్స్ స్టాట్యూ థాయిలాండ్ లోని మేడం టుస్సాడ్స్ వ్యాక్స్ స్టాట్యూ మ్యూజియంలో ఉంది, ఆ ఘనత సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గా ప్రభాస్ నిలిచారు.

Read Also:GSLV MK-3 : ఇస్రో ఖాతాలో మరో విజయం.. జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగం సక్సెస్

రాజమౌళి కాకుండా బాలీవుడ్ లో ఆయనకు నచ్చిన డైరెక్టర్ ఎవరు అంటే రాజ్కుమార్ హిరాణి. ప్రభాస్ ఆయన చేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్ లాంటి సినిమాలు 20 సార్లకు పైగా చూశారట. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే చివరిగా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టారు. అందులో నాగాశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ వంటి సినిమాలు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక అనౌన్స్ చేయకుండానే మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Show comments