Site icon NTV Telugu

Mumbai Indians: ముంబై జట్టులోకి యువ ఆటగాడు..

Harvik Desai

Harvik Desai

నేడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బిగ్ ఫైట్ జరగనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా గెలిచిన ముంబై ఇండియన్స్ వారి సొంత మైదానమైన వాంఖడేలో స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతుంది. ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో.. ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. మిగతా మ్యాచ్ లు ఓటమి పాలైంది. ఈ క్రమంలో.. జట్టు విజయం కోసం పరితపిస్తుండగా.. ఓ యువ ఆటగాడిని రంగంలోకి దింపుతుంది. విష్ణు వినోద్ స్థానంలో హార్విక్ దేశాయ్ జట్టులోకి రానున్నాడు.

Virat Kohli: టీమిండియాలో సీత, గీత ఎవరో తెలుసా..! కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వాస్తవానికి.. విష్ణు వినోద్ ఎడమ చేతికి గాయమై ఈ సీజన్‌కు దూరంగా ఉన్నాడు. అతను త్వరగా కోలుకోవాలని ముంబై ఇండియన్స్ ఆకాంక్షించారు. కాగా.. అతని స్థానంలో సౌరాష్ట్ర కుడిచేతి వాటం కలిగిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌ను జట్టులోకి తీసుకున్నారు. హార్విక్ దేశాయ్ భారత్ తరపున అండర్-19 ప్రపంచకప్ కూడా ఆడాడు. ఈ క్రమంలో.. హార్విక్ దేశాయ్ ముంబై ఇండియన్స్‌లో చేరడాన్ని ధృవీకరిస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియాకు తెలిపింది.

Aadhaar ATM Cash: కేవలం ఆధార్ తో మీ ఇంటి దగ్గరే క్యాష్ విత్ డ్రా.. ఎలా అంటే..?!

ముంబై ఇండియన్స్.. సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ హార్విక్ దేశాయ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ఐపీఎల్ తెలిపింది. కాగా.. హార్విక్ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు. అతను 2018లో ప్రపంచ కప్ గెలిచిన ఇండియా అండర్-19 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ ప్రపంచకప్‌లో విన్నింగ్ రన్స్‌ ఇతడే కొట్టాడు. అంతేకాకుండా.. 2023 సయ్యద్‌ ముస్తాక్ అలీ ట్రోఫీలో 175 స్ట్రైక్‌రేట్‌తో 336 పరుగులు చేశాడు.

Exit mobile version