Site icon NTV Telugu

OYO Room: లవర్ తో కలసి ఓయోకు వెళ్లిన యువకుడు.. కొద్ది క్షణాలకే..

Oyo Hote

Oyo Hote

ప్రియురాలితో కలిసి ఓయోకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువకుడి ఉదంతం ఇప్పుడు హైదరాబాద్ లో కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్‌ లోని ఎస్సార్‌ నగర్‌లో చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జాచర్లకు చెందిన హేమంత్‌ (28) ఒక ఇటుకల ఫ్యాక్షరీలో పనిచేస్తున్నాడు. గత ఏడేళ్ల నుంచి వారి ప్రాంతానికి చెందిన యువతి (27) తో పరిచయం ఏర్పడింది. అదికాస్త ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. వీరిద్దరూ సోమవారం హైదరాబాద్‌ లో జరిగిన ఓ కార్యక్రమానికి మద్యం తాగి హాజరయ్యారు. ఆ తర్వాత రాత్రి ఎస్సార్‌ నగర్‌ లోని ఓయో టౌన్‌ హౌస్‌లో బస చేశారు. హేమంత్‌మద్యం మత్తులో తెల్లవారుజామున 2 గంటలకు బాత్రూమ్‌ కు వెళ్లాడు. అయితే హేమంత్‌ ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో ఓ యువతి అతడిని చూడగా అప్పటికే బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

Also Read: Jasprit Bumrah: లక్కీ ఫెలో.. తన ప‌ర్పుల్ క్యాప్ ను పిల్లాడికి ఇచ్చేసిన బుమ్రా..

ఇక హేమంత్‌ తోపాటు రూమ్ కి వెళ్లిన యువతి జరిగిన విషయాన్నీ స్నేహితులకు చెప్పడంతో., వారు హేమంత్‌ ను బెడ్‌ పై పడుకోబెట్టి 108 అంబులెన్స్‌ కు కాల్ చేశారు. దాంతో అక్కడి చేరుకున్న వైద్యబృందం అనుమానాస్పద స్థితిలో ఉన్న హేమంత్‌ ను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని తల్లికి తెలపడంతో.. ఆమె అక్కడకు చేరుకొని సంఘటన గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి మృతిపై ఉన్న అనుమానాలపై విచారణ జరిపించాలని కోరింది. దింతో పోలీసులు శవపరీక్ష నివేదిక ఆధారంగా మృతికి గల కారణాలను వెల్లడిస్తామని ప్రకటించారు.

Exit mobile version