లోన్ యాప్స్ లో అప్పులు చేసి వాటిని తీర్చేందుకు కొందరు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు తమకు తామే కిడ్నాప్ ప్లాన్ చేసుకుని కుటుంబ సభ్యుల నుంచే డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా స్నేహితుడి ఇంట్లోనే చోరికి తెగబడ్డాడు. బంజారాహిల్స్ లో ఆడవేషంలో వచ్చి బంగారం డబ్బును దోచుకెళ్లాడు హర్షిత్. లోన్ యాప్ ల ద్వారా అప్పులు చేసి, అప్పులు తీర్చాలని దొంగతనాలకు పాల్పడ్డాడు హర్షిత్ అనే యువకుడు.
Also Read:India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత, భారత్-పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తత..
బంజారాహిల్స్ ఉదయ్ నగర్ కు చెందిన శివరాజ్ ఇంట్లో ఈనెల16న చోరి జరిగింది. శివరాజ్ కుటుంబంతో నిజామాబాద్ వెళ్లారు. ఈ విషయం శివరాజ్ కొడుకు లింగంపల్లి సిసి కెమెరా టెక్నిషియన్ హర్షిత్ కి చెప్పాడు. ఇదే అదునుగా భావించిన హర్షిత్ స్నేహితుడి ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేశాడు. ఆడవేషం కట్టి స్నేహితుడి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. శివరాజ్ ఇంట్లో తాళాలు పగలగొట్టి 6.75తులాల బంగారం, 1.10లక్షల నగదు చోరి చేశాడు. ఈ వ్యవహారమంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
Also Read:Hydra: గాజులరామారంలో “హైడ్రా” ఆపరేషన్.. 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి..
ఇంటికి తిరిగి వచ్చిన శివరాజ్ ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిసి ఫుటేజ్ పరిశీలించి హర్షిత్ ఇంటికి వెళ్లి విచారించగా దొంగతనం వ్యవహారం బయటపడింది.. 6.75తులాల బంగారం, 85వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితున్ని రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.
