Site icon NTV Telugu

AP News: మాయమాటలు చెప్పి.. పదో తరగతి విద్యార్థినిపై యువకుడు అత్యాచారం, చివరకు..!

Wgl Students Rape

Wgl Students Rape

రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. మాయమాటలతో బయటకు తీసుకువెళ్లి పదో తరగతి హాస్టల్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫోక్సో కేసు నమోదైంది. నిందితుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన అజయ్‌గా పోలీసులు గుర్తించారు. రాజమండ్రి టూ టౌన్ సీఐ శివ గణేష్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

రాజమండ్రిలోని ఓ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థిని సోమవారం సాయంత్రం అన్నయ్య వచ్చాడని, సబ్బులు తెచ్చుకోవాలని హాస్టల్ వార్డెన్‌కు చెప్పి బయటకు వెళ్ళింది. పరిచయం ఉన్న అజయ్ అనే యువకుడు మాయమాటలు చెప్పి గోదావరి గట్టుకు బైక్‌పై తీసుకువెళ్లాడు. అజయ్ వెంట బైక్‌పై మరో యువకుడు వచ్చాడు. ఆ బాలిక పట్ల అసభ్య ప్రవర్తిస్తూ, మాయమాటలతో అజయ్ రైల్వే స్టేషన్ రోడ్లో ఓ లాడ్జికు తీసుకువెళ్లాడు. రూమ్‌లో బాలికపై అజయ్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని బైక్‌పై తీసుకువచ్చి దేవీచౌక్‌లో దింపివేశాడు.

Also Read: CM Chandrababu: లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం!

విద్యార్థిని హాస్టల్ లోనికి వెళ్లిపోయింది. అమ్మాయి కంగారు పడటం సహా మెడ, పెదాల పైన గాట్లు ఉండేసరికి అనుమానం వచ్చి వార్డెన్ ప్రశ్నించింది. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక జరిగిన విషయం చెప్పడంతో కంగారుపడి వెంటనే వారి తల్లిదండ్రులకు హాస్టల్ వార్డెన్ సమాచారం ఇచ్చింది. ముందుగా బాలికని ఆసుపత్రికి తీసుకువెళ్లి.. ఆ తర్వాత వార్డెన్తో సహా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి బంధువులు పిర్యాదు చేశారు. అనుమానిత వ్యక్తి సెల్ నెంబర్ ఆధారంగా.. రావులపాలెంకు చెందిన అజయ్ గా పోలీసులు భావిస్తున్నారు. రాజమండ్రి పోలీసులు నిందితుడిపై ఫోక్సో, అత్యాచారం సెక్షన్లు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version