Site icon NTV Telugu

Hussain Sagar: హుస్సేన్‌ సాగర్‌లో అగ్ని ప్రమాదం.. యువకుడు మిస్సింగ్!

Hussain Sagar Fire Accident

Hussain Sagar Fire Accident

నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో ఆదివారం రాత్రి అపశ్రుతి చోటు చేసుకున్నా విషయం తెలిసిందే. బాణసంచా పేల్చేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్‌కు చెందిన రెండు బోట్లలో బాణ సంచా సామగ్రిని సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లారు. టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు తిరిగి అదే బోట్లపై పడ్డాయి. దాంతో బోట్లలో ఉన్న బాణసంచా పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

Also Read: Palla Rajeshwar Reddy: ఈరోజు జరిగిన అరాచకం నిజాంపాలనలో కూడా జరగలేదు!

ప్రమాదం జరిగిన సమయంలో రెండు బోట్లలో కలిపి ఏడుగురు ఉండగా.. వారిలో నలుగురికి గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఓ యువకుడు మిస్ అయినట్లు తెలుస్తోంది. ఓ బోటులో స్నేహితులతో వచ్చిన నాగరంకు చెందిన అజయ్ (21) అనే యువకుడు కనపడడం లేదని కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి హుస్సేన్ సాగర్‌లో అజయ్‌తో ఉన్న ఫ్రెండ్స్ అందరు సురక్షితంగా ఉన్నారు. అజయ్ మాత్రం ఏ ఆస్పత్రిలో లేడని పోలీసులు అంటున్నారు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు అజయ్ కోసం వెతుకుతున్నారు.

Exit mobile version