NTV Telugu Site icon

Tragedy: అమెరికా వెళ్లేందుకు అంతా రెడీ.. ఇంతలోనే అనంతలోకాలకు..

Road Accident

Road Accident

Tragedy: ఆ యువకుడు అమెరికాకు వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇంతలోనే మృత్యువు ఆ యువకుడిని కబలించివేసింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన వేంపల్లి శ్రావణ్ గౌడ్ (27) సోమవారం రాత్రి 11.30 లకు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మంథని గ్రామానికి చెందిన వేంపల్లి శ్రావణ్ గౌడ్ నెల రోజుల క్రితం అమెరికా దేశం నుంచి వచ్చి స్వగ్రామంలో పండుగలు చేసి బంధువులను స్నేహితులను కలిసి తిరిగి అమెరికా వెళ్దాం అనుకొని అదే పనిలో శ్రావణ్ గౌడ్ నిమగ్నమయ్యాడు.

Read Also: Russia: ఉద్యోగాలకై వెళ్తే యుద్ధంలోకి దింపారు.. రష్యాలో చిక్కుకున్న భారత యువకులు

స్వదేశానికి వచ్చి స్నేహితులను కలిసేందుకు ఆర్మూర్‌కు వచ్చి తిరిగి మంథని వెళ్తుండగా.. రాత్రి 11.30 గంటల సమయంలో బైక్‌ అదుపుతప్పి ట్రాక్టర్‌ ట్రాలీ కిందకు వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో మృతుడితో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 12న తిరిగి అమెరికాకు వెళ్లాల్సి ఉండగా.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రావణ్‌ గౌడ్‌ మృతిని అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.