NTV Telugu Site icon

Lady Harrasment : కుర్రాళ్లు జాగ్రత్త.. ఎంజాయ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఆంటీలు

Aunty

Aunty

Lady Harrasment : సాధారణంగా కుర్రాళ్లు అమ్మాయిలను వేధిస్తుంటారు. వారి వేధింపులు భరించలేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న వార్తలు విన్నాం. కానీ ఓ వివాహిత కారణంగా ఓ యువకుడు చనిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయదుర్గం పట్టణానికి చెందిన కుత్తీష్‌ అలియాస్‌ పృథ్వీ (30) ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే పట్టణానికి చెందిన ఓ వివాహితతో తనకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త సన్నిహిత సంబంధానికి దారి తీసింది. దానిని ఆసరాగా తీసుకుని వివాహిత బ్లాక్ మెయిల్ కు పాల్పడింది.

Read Also:Ram Charan: బాబాయ్ సినిమా గ్లిమ్ప్స్ అబ్బాయికి బాగా నచ్చేసిందట…

వారు చనువుగా ఉన్నప్పుడు జరిపిన ఫోన్‌ సంభాషణలు, ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోలను చూపించి గత కొద్ది కాలంగా తనను వేధిస్తోందని గతంలో కుత్తీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆ మహిళ కూడా యువకుడిపై ఫిర్యాదు చేసింది. పరస్పర ఫిర్యాదులపై పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వారం కిందట సదరు వివాహిత ఎస్పీని కలిసి స్పందనలో ఫిర్యాదు కూడా చేసింది. దీంతో పోలీసులు ఇద్దరినీ పిలిపించి విచారణ చేశారు. శనివారం తిరిగి విచారణకు రావాలని ఇద్దరికీ సమాచారం అందించారు. గురువారం రాత్రి వివాహిత కుత్తీష్‌కు తన ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. అతను వెళ్లకపోవడంతో మరొక వ్యక్తిని తీసుకురమ్మని పంపింది. దీంతో తప్పని పరిస్థితిలో కుత్తీష్ ఆమె ఇంటికి వెళ్లాడు.

Read Also:How To Become Rich: ధనవంతులు కావాలనుకుంటున్నారా.. అయితే ఈ 10చిట్కాలు పాటించండి

ఇంటికొచ్చాక అక్కడ జరిగిన విషయాన్ని తన భార్య లలితకు చెప్పాడు. శనివారం పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సి ఉందని, ఎవరినీ పంపినా ఆమె వద్దకు ఇంకోసారి వెళ్లొద్దని భార్య చెప్పింది. ఇంతలో బంధువుల పెళ్లికి ఉండడంతో అక్కడికి వెళ్లి వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేద్దామని భార్య కుత్తీష్‌కు నచ్చచెప్పింది. ఉదయాన్నే ఆమె ఉరవకొండకు బయలుదేరింది. కానీ.. మార్గమధ్యలో వెళ్లగానే తన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. భర్త మరణ వార్త విని భార్య లలిత బోరున విలపించింది. తన భర్త ఆత్మహత్య చేసుకునేందుకు వివాహిత వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయకపోవడంతో ఆమె స్టేషన్‌ ముందు కూర్చొని నిరసన తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుత్తీష్‌ స్నేహితులు భారీ సంఖ్యలో ఆస్పత్రికి చేరుకోవడంతో రద్దీ నెలకొంది. సదరు వివాహిత బాధితులు పట్టణంలో చాలా మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.