Site icon NTV Telugu

Online Games: ఆన్‌లైన్ గేమ్స్ కి మరో యువకుడు బలి..

Onlinegame

Onlinegame

ఆన్ లైన్ గేమ్స్ నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. భారీగా డబ్బులు వస్తాయన్న ఆశతో పెట్టుబడులు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. అప్పులు చేసి అవి తీర్చే మార్గం లేక మానసిక వేదనతో తనువు చాలిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్స్ కారణంగా కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. తాజాగా మరో యువకుడు ఆన్ లైన్ గేమ్స్ కి బలయ్యాడు. కుత్బుల్లాపూర్, సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ గేమ్స్ కి అలవాటు పడి ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also Read:ఆయుర్వేదంలో ఆపరేషన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. వ్యతిరేకిస్తున్న అల్లోపతి వైద్యులు

రవీందర్(24) అనే యువకుడు తాను ఆన్లైన్ గేమ్స్ లో పెట్టుబడి పెట్టి మోసపోయానని వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరు బాధ్యులు కాదని, సూరారం లోని తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. యువకుడి ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ గేమ్స్ లో ఇన్వెస్ట్ చేయొద్దని, అప్పులపాలై ప్రాణాలు పోగొట్టుకోవద్దని పోలీసులు యువతకు సూచించారు.

Exit mobile version