NTV Telugu Site icon

Crime News: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతుకోసి హత్య.. ఆపై!

Eluru Crime

Eluru Crime

Crime News: ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. తనను ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడికి పాల్పడి హత్య చేసి.. తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా సత్రంపాడులో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో యువతి పీక కోసి ఓ యువకుడు కిరాతకంగా హత్య చేశాడు. యువతి ప్రేమించడం లేదనే కక్షతో కత్తితో గొంతుకోసి చంపేశాడు. అనంతరం కత్తితో గొంతు కోసుకుని ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. మృతురాలు రత్న గ్రెసీగా, దాడికి పాల్పడిన వ్యక్తి యేసు రత్నంగా గుర్తించారు.

Read Also: Rangareddy Crime: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. హత్య అంటున్న కుటుంబ సభ్యులు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రేమిస్తున్నానని వెంటపడి యువతిని ఆమె ఇంటి సమీపంలోనే హతమార్చి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి యువకుడు పాల్పడిన ఘటన ఏలూరు నగరంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఏలూరు నగరంలోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన జక్కుల రత్న గ్రేసీ(22) స్థానికంగా తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది. తొట్టిబోయిన యేసురత్నం(23) అనే యువకుడు ఆమె వెంట గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడని వెంటపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం యువతీ ఇంటి సమీపంలో ఉండగా అతను తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతీ అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే యేసురత్నం కూడా అదే కత్తితో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

యేసు రత్నం గతంలో ఇంటికి వచ్చి గ్రేసిని పెళ్లి చేసుకుంటానంటూ అడిగాడని.. దానికి ఒప్పుకోలేదని యువతి తల్లిదండ్రులు తెలిపారు.పెళ్లికి ఒప్పుకోలేదని కక్షగట్టిన యేసురత్నం దారుణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మాయి జోలికి రాకుండా చూడాలని యువకుడి కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్లు వారు వెల్లడించారు. కానీ మా కూతురిని మాకు కాకుండా చేశాడంటూ బోరున విలపించారు యువతి తల్లిదండ్రులు.

Show comments