NTV Telugu Site icon

Young Indians: భారత్లో పెరిగిపోతున్న నిరుద్యోగం.. ఐఎల్వో హెచ్చరిక

Unemploees

Unemploees

దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. ఇప్పటి వరకు విద్యావంతులు, చదువుకున్న యువతతో మెరుగైన ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న భారత్.. భవిష్యత్తులో డిమాండ్‌కు తగినంత యువ కార్మిక బలగం అందుబాటులో ఉండదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ కార్మిక సమాఖ్య(ILO).. ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌’తో కలిసి ‘భారత ఉపాధి నివేదిక-2024’ను తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది.

Read Also: Noida : పొగమయమైన నోయిడా.. 72గంటలు దాటినా అదుపులోకి రాని మంటలు

భారతదేశంలో విద్య లేని వారు 3.4% ఉంటే ఉన్నత విద్యావంతులైన యువకులు నిరుద్యోగులుగా ఉంటారు. గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు 29.1శాతంగా ఉంది. ఇక, భారతదేశంలో నిరుద్యోగం ప్రధానంగా యువతలో సమస్యగా మారింది. ప్రత్యేకించి సెకండరీ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ విద్యను కలిగి ఉన్న యువకులలో ఇది కాలక్రమేణా తీవ్రమైంది అని ఐఎల్వో తెలిపింది. శ్రామిక శక్తి యొక్క నైపుణ్యాలు, మార్కెట్లో సృష్టించబడుతున్న ఉద్యోగాల మధ్య చాలా అసమతుల్యతను గణాంకాలు సూచిస్తున్నాయి. భారతదేశ పేద పాఠశాల విద్య కాలక్రమేణా దాని ఆర్థిక అవకాశాలకు ఆటంకం కలిగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ లాంటి ఆర్థికవేత్తల హెచ్చరికలు చేశారు.

Read Also: Danam Nagender: కన్ఫూజన్‌లో దానం..! మారనున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి..

భారతదేశంలో యువత నిరుద్యోగం రేట్లు ఇప్పుడు ప్రపంచ స్థాయిల కంటే ఎక్కువగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ కొత్త విద్యావంతులైన యువ శ్రామిక శక్తిలో ప్రవేశించిన వారికి వ్యవసాయేతర రంగాలలో తగినంత వేతనంతో కూడిన ఉద్యోగాలను సృష్టించలేకపోయింది. దీంతో రోజు రోజుకు పెరుగుతున్న నిరుద్యోగ రేటును ప్రతిబింబిస్తుంది. అయితే, చైనాలో 16-24 సంవత్సరాల వయస్సు గల యువకుల నిరుద్యోగిత రేటు ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో 15.3 శాతానికి పెరిగింది. పట్టణ జనాభాలో 5.3 శాతం కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఇది 2000లో సంవత్సరంలో 88.6 శాతంగా ఉన్న 15-29 సంవత్సరాల వయస్సు గల భారతీయ యువ నిరుద్యోగుల వాటా 2022లో 82.9 శాతానికి తగ్గగా.. విద్యావంతులైన యువకుల వాటా ఈ కాలంలో 54.2% నుండి 65.7%కి పెరిగిందని ప్రపంచ కార్మిక సమాఖ్య చెప్పుకొచ్చింది.

Read Also: Praful Patel: ప్రఫుల్‌పటేల్‌కు సీబీఐ క్లీన్‌చిట్‌.. బీజేపీతో దోస్తీనా కారణమా..?

ముఖ్యంగా మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు. వారు చదువుకున్న నిరుద్యోగ యువతలో 76.7% మంది ఉన్నారు. పురుషులలో 62.2% మంది ఉన్నట్లు ప్రపంచ కార్మిక సమాఖ్య గణాంకాలు తెలియజేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే అత్యల్ప మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేట్లలో భారతదేశం ఒకటి.. దాదాపు 25% ఉందని ఐఎల్ఓ తెలిపింది.