NTV Telugu Site icon

Director : పంథా మార్చుకోకపోతే త్వరలోనే కెరీర్ క్లోజ్.. డేంజర్ జోన్లో మరో డైరెక్టర్

New Project 2024 11 07t114646.323

New Project 2024 11 07t114646.323

Director : ఔడెటెడ్, ఊకదంపుడు స్టోరీలతో సినిమాలను చేస్తే ఎలా ఉంటుందనేది కొందరు డైరెక్టర్లను చూస్తే అర్థం అవుతూనే ఉంది. స్టోరీ పస లేకపోతే ఎంత పెద్ద హీరోను పెట్టి సినిమా తీసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. సినిమాలను అభిమానించే ప్రేక్షకుల తీరు ఎప్పటికప్పుడూ మారుతూనే ఉంటుంది. అందుకే కాలానికి అనుగుణంగా స్టోరీలను రచించడంలో కాస్త అప్ డేట్ కావాలి. లేదంటే కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి తీసినా అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సినిమాకు కథే బలం. దానిపై దృష్టి పెట్టాలి. అలా చేయకపోతే అవ‌కాశాలు లేక ఖాళీగా ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్పడుతుంది. ఇండ‌స్ట్రీతో పాటు అప్ డేట్ కాక‌పోతే? నేటి జ‌న‌రేష‌న్ ని మెప్పించ‌డం సాధ్యం కాదు. ఇప్పటికే ఈ లిస్ట్ లో కొంత మంది ద‌ర్శకులున్నారు. వి. వి. వినాయ‌క్, శ్రీనువైట్ల, కృష్ణవంశీ, రాంగోపాల్ వ‌ర్మ, సురేంద‌ర్ రెడ్డి, శ్రీకాంత్ అడ్డాల ఇలా కొంత మంది కాదు చాలా మంది ద‌ర్శకులున్నారు. వీళ్లంతా ఒకప్పుడు సూప‌ర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన వాళ్లే.

Read Also:Liquor Supply Stopped: రెండు రోజులుగా నిలిచిపోయిన మద్యం అమ్మకాలు.. కారణం అదేనా..?

కానీ ఇప్పుడు అవ‌కాశాలు లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. వీవీ వినాయక్ గతంలో ఎంత మంది హీరోలకు బ్లాక్ బస్టర్లు ఇచ్చాడో తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదంటే కారణం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే పూరీ జ‌గ‌న్నాథ్ పోకిరీ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రాని పరిస్థితి. ఇక ఇండ‌స్ట్రీలో ఫ్యామిలీ సినిమాల‌కు చాలాకాలం క్రిత‌మే కాలం చెల్లిపోయింది. ఫ్యామిలీ సినిమాలు..సెంటిమెంట్ ని బేస్ చేసుకుని ఏ ద‌ర్శకుడు క‌థ‌లు రాయ‌డం లేదు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. థ్రిల్లర్ , స‌స్పెన్స్, కామెడీ జాన‌ర్లో సినిమాలు చేస్తూ విజ‌యాలు అందుకుంటున్నారు.

Read Also:Fire Accident: టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

ఇండ‌స్ట్రీకి కొత్తగా వ‌చ్చిన కుర్రాళ్లే ఈ త‌ర‌హా హిట్లు అందుకుంటున్నారు. పాన్ ఇండియాకి క‌నెక్ట్ అయ్యేలా యూనివ‌ర్శల్ పాయింట్ ని రాసుకుని సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడిదే ట్రెండ్. అయితే నేటి జ‌న‌రేష‌న్ డైరెక్టర్లలో ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని ఓ యంగ్ డైరెక్టర్ త‌న సినిమాలతో అల‌రిస్తున్నాడు. ఇప్పటివ‌ర‌కూ అత‌డు తెర‌కెక్కించిన సినిమాల‌న్నీ కామెడీ, ఎమోష‌న్, ఫ్యామిలీ బేసిస్ లో చేసి స‌క్సెస్ అందుకున్నారు. అయితే అవి ఆడ‌డం వెనుక హీరోల ఇమేజ్ అన్నది అత్యంత కీల‌క పాత్ర పోషించింది. ఆ జాన‌ర్ సినిమాలు కొత్త వారితో చేస్తే ఫ‌లితాలు మ‌రోలా ఉంటాయి. అందుకే డైరెక్టర్ తెలివిగా త‌న క‌థ‌ల‌కి స్టార్ హీరోలను లాక్ చేసి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఓ ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరోతో ఓ సినిమా చేస్తున్నాడు. అత‌డికి మ‌హిళా అభిమానులు ఎక్కువ‌. కానీ ఆ డైరెక్టర్ ఇలాంటి కథలనే ఎంచుకుని సినిమాలు తీస్తూ పోతే మాత్రం ఎక్కువ కాలం కొనసాగ‌డం క‌ష్టం. ట్రెండ్ కి దూరంగానే అత‌డి సినిమాలుంటున్నాయనే విమ‌ర్శ వినిపిస్తుంది. ఇలా సేఫ్ గేమ్ ఆడుతూ పోతే కేరీర్ త్వరలోనే క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది.