ప్రేమికులు తాము ప్రేమించిన వారి కోసం ఎంత పెద్ద సమస్యనైనా ఎదిరిస్తారు. ఎంతటి కష్టానైనా భరిస్తారు. అంతేకానీ వారిని నమ్మిన వారి చేయిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. అయితే ఇక్కడ ఓ యువకుడు మాత్రం ట్రాఫిక్ పోలీస్ బైక్ ఆపాడో లేదో తన ప్రేయసిని నడిరోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వీడియోలో ఒక యువకుడు అమ్మాయిని బైక్ వెనుక ఎక్కించుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో ఒక ట్రాఫిక్ పోలీస్ ఆ బండిని ఆపే ప్రయత్నం చేస్తాడు. దీంతో భయపడిపోయిన ఆ యువకుడు బైక్ వెనుక కూర్చొని ఉన్న యువతి కిందపడిపోయినా పట్టించుకోకుండా వేగంగా వెళ్లిపోయాడు. అంతేకాకుండా మరో స్కూటీని కూడా గుద్దే ప్రయత్నం చేశాడు.
Also Read: Hombale Films: ఏ బాబు నిద్రలేయ్… నెల రోజుల్లో రిలీజ్ ఉంది
ఇక పడిపోయిన యువతిని ట్రాఫిక్ పోలీసు రోడ్డు మీద నుంచి పక్కకు తీసుకువచ్చి ఆ యువకుడి వివరాలు సేకరించారు. ఈ వీడియోను అభిషేక్ ఆనంద్ జర్నలిస్ట్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ అమ్మాయి బ్రేక్ అప్ చెప్పడానికి ఇంకా ఆలస్యం చేయకూడదు. ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. తన ప్రేమసి కోసం ఆ యువకుడు ఒక్క చలాన్ ను కట్టలేక నడిరోడ్డుపై వదిలేసి పోయాడు అని ఆ వీడియోకు క్యాప్షన్ జోడించాడు.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వీడియో తెలపకపోయినప్పటికి ట్రాఫిక్ పోలీసు ఆధారంగా ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగినట్లు గుర్తించవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు యువకుడి తీరును తప్పుబడుతున్నారు.
लड़की को breakup में देर नहीं करनी चाहिए
ऐसे बहुत आयेंगे जाएँगे
यह लड़का गर्लफ़्रेंड के लिये एक चालान नहीं भर सका
बीच सड़क बाइक से उतार दिया— Abhishek Anand Journalist 🇮🇳 (@TweetAbhishekA) August 14, 2023