Arvind Kejriwal: బెయిల్ ఇస్తే అధికారిక విధులు నిర్వహించొద్దు.. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేస్తే.. అధికారిక విధులను నిర్వహించొద్దని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసుతో సంబంధం ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జైలు శిక్ష అనుభవిస్తున్న ముఖ్యమంత్రి పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని న్యాయస్థానం సూచించింది.
Read Also: China Knife Attack: ఆసుపత్రిలో కత్తితో దాడి.. ఇద్దరు మృతి, 21 మందికి గాయాలు
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది అసాధారణ పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’’ అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
విచారణ సందర్భంగా, మధ్యంతర బెయిల్‌పై విడుదలైతే కేజ్రీవాల్ కార్యాలయానికి హాజరవుతారా, ఫైళ్లపై సంతకం చేస్తారా.. “ఇతరులకు ఆదేశాలు ఇస్తారా” అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని కోర్టు ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ, కేజ్రీవాల్ ఎక్సైజ్ కేసుతో వ్యవహరించడం లేదు. ఆయన సిట్టింగ్ ముఖ్యమంత్రి” అని అన్నారు. ఈ నేపథ్యంలో ఆప్ అధినేతను బెయిల్‌పై విడుదల చేయాలని నిర్ణయించుకుంటే.. “మీరు అధికారిక విధులను నిర్వహించకూడదని మేము చాలా స్పష్టంగా చెప్పాము, ఎందుకంటే ఇది క్యాస్కేడింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది” అని బెంచ్ పేర్కొంది. కేజ్రీవాల్ “ఢిల్లీ సిట్టింగ్ ముఖ్యమంత్రి, లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నందున” బెయిల్ వాదనలు వింటామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కి సుప్రీం కోర్టు తెలిపింది.
Read Also: Pm Modi: దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు
అయితే సుప్రీం అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది “సాధారణ పౌరులతో పోలిస్తే రాజకీయ నాయకుడికి ప్రత్యేక హక్కులు లేవు. ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ బెయిల్‌పై విడుదల చేయాలా? కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండకూడదు. ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇక, ఈ కేసులో కేజ్రీవాల్ దర్యాప్తునకు సహకరించలేదు. ఆరు నెలల్లో 9 సమన్లను పట్టించుకోలేదు. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చింది” అని దర్యాప్తు సంస్థ ఈడీ న్యాయస్థానానికి తెలిపింది. ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం బెయిల్‌పై తీర్పు వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!