NTV Telugu Site icon

PF Withdraw: ఇలా చేస్తే.. పీఎఫ్ అకౌంట్ నుంచి 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు..!

Pf

Pf

ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికీ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఇందులో మనం పనిచేసే కంపెనీ మన వేతనం నుంచి 12 శాతం వరకు కట్ చేసుకుంటుంది. సంస్థ కూడా అంతే మొత్తంలో జమ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్రం-ఈపీఎఫ్‌ఓ వడ్డీ యాడ్ చేస్తుంది. అయితే మన అవసరాల కోసం.. మనం డిపాజిట్ చేసిన పీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ ఈ అవకాశం కల్పిస్తోంది. పెళ్లి, ఆస్పత్రి ఖర్చుల కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం, చదువు కోసం.. ఇలా పలు కారణాలతో విత్‌డ్రా చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంది తమకు అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బులు తీసుకోవడం చూస్తూనే ఉంటాం.

Read Also: Pooja Hegde : మాస్ రాజా రవితేజ సినిమాలో నటించబోతున్న బుట్టబొమ్మ..?

అయితే ఏ కారణానికి ఎంత తీసుకోవచ్చనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. చాలా వరకు మనీ క్లెయిమ్ చేస్తుంటారు. ఎంత వస్తుందనేది ఆ తర్వాత డబ్బులు అకౌంట్లో క్రెడిట్ అయినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. అయితే మనకు ఏ కారణంపై ఎంత వరకు డబ్బులు వస్తాయో ఇప్పుడు చూద్దాం.. ఈపీఎఫ్ ఖాతాదారులు.. పెళ్లి కోసం 50 శాతం వరకు పీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ విత్‌డ్రా కోసం మాత్రం ఏడేళ్ల సర్వీస్ పూర్తై ఉండాలి. ఈపీఎఫ్ సభ్యుడు లేదా వారి కొడుకు/కూతురు/సోదరుడు లేదా సోదరి పెళ్లి కోసం డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక ఉన్నత చదువుల కోసం కూడా 50 శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు.

Read Also: Aasara Pension: దివ్యాంగులకు శుభవార్త.. ఆసరా పెన్షన్ పెంచిన కేసీఆర్ సర్కార్

అయితే, కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేసేందుకు పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు.. ఇక్కడ ఐదేళ్ల సభ్యత్వం అవసరం. ఇంటి స్థలం కొనుగోలు చేసినందుకు.. నెలవారీ జీతం కంటే 24 రెట్లు, ఇల్లు కొనుగోలు చేసేందుకు మాత్రం 36 రెట్ల వరకు డ్రా చేసుకోవచ్చు.. ఇంటి నిర్మాణానికి 36 రేట్లు వస్తుంది.. ఇంటి నిర్మాణం కోసం మాత్రం నెల జీతం కంటే 12 రెట్లు డ్రా చేయొచ్చు. ఇక ఆస్పత్రి ఖర్చుల కోసం కూడా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే వీలు ఉంటుంది. ఉద్యోగి నెలవారీ జీతానికి 6 రెట్లకు సరిపడా నగదును తీసుకోవచ్చు.. ఇంకా సదరు ఉద్యోగి మరో సంవత్సరంలో రిటైర్ అయిపోతాడు అనుకున్నప్పుడు.. పీఎఫ్ అకౌంట్ నుంచి 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.. అయితే.. రిటైర్మెంట్‌కు ఏడాది లోపే ఇది వర్తిస్తుందని మీరు గుర్తు పెట్టుకోవాలి.