DrivingLicense: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి షాక్.. ఇకపై ఆ టెస్ట్ పాసైతేనే ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు!
- ఇకపై ఆ టెస్ట్ పాసైతేనే ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు
- రోడ్ సేఫ్టీ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు
- రోడ్డు భద్రతా రూల్స్ తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టూవీలర్, ఫోర్ వీలర్ వాహనం ఏదైనా నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. డ్రైవింగ్ వృత్తిని ఎంచుకునే వారు, వాహనాలు నడిపేవారు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాల్సిందే. డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకునే వారు ఆర్టీఏలో దరఖాస్తు చేసుకుంటుంటారు. ఆ తర్వాత దరఖాస్తుదారులకు ఎల్ఎల్ఆర్ టెస్ట్, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహించి అర్హత సాధించిన వారికి శాశ్వత లైసెన్స్ జారీ చేస్తుంటారు. కానీ ఇకపై మరో టెస్ట్ కూడా పాస్ కావాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ పాసైతేనే ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇక నుంచి ఈ రెండు టెస్టుల కంటే ముందు రోడ్ సేఫ్టీ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Also Read:IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
Also Read
డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పటికీ కొందరు డ్రైవర్లు ప్రమాదాలకు కారణమవుతుంటారు. నైపుణ్యం లేక, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన లేకపోవడం, రూల్స్ పాటించకపోవడం, రోడ్డు సేఫ్టీపై కూడా అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకు అధికారులు ట్రాఫిక్ నిబంధనలు తెలిసేలా లైసెన్సుల జారీకి ముందే రోడ్సేఫ్టీపై అవగాహన కల్పించేందుకు టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ పాసైతే సర్టిఫైడ్ నంబర్ ఇస్తారు. ఈ నంబర్ ద్వారా లర్నింగ్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read:Story Board: ఎక్కడో యుద్ధం.. మన ఇంట్లో సంక్షోభం..
కొత్తగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి స్లాట్ బుక్ చేసుకున్న రోజే ఆర్టీఏ ఆఫీసులో ట్రాఫిక్ రూల్స్ పై కంప్యూటర్లో పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాస్అయితే వెంటనే లెర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. దీని వ్యాలిడిటీ 6 నెలల వరకు ఉంటుంది. ఈలోపు పర్మినెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న రోజు దరఖాస్తుదారు టూవీలర్ లేదా కారును టెస్ట్ ట్రాక్ పై నడపాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ లో పాసైతేనే పర్మినెంట్ లైసెన్స్ జారీ చేస్తారు. రోడ్డు భద్రతా రూల్స్ తప్పనిసరిగా అమలు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఈ కొత్త రూల్ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!