సోషల్ మీడియలో టీమిండియా క్రికెటర్లు ఎప్పటికప్పుడు తమదైన శైలిలో నానా హంగామా చేస్తుంటారు. తాజాగా సోషల్ మీడియలో ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్ దుమారం రేపారు. కొన్నాళ్ల క్రితం శుభ్ మన్ గిల్ ధరించిన షర్ట్‌ను ఇషాన్ కిషన్ ధరించాడు. టీమిండియా క్రికెట్ జట్టులో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ కొత్తగా స్నేహితులయ్యారు. వీరిద్దరు జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నా.. ఫ్రెండ్ షిప్ వియయంలో మాత్రం అలాంటిదేమీ లేదు. ఐపీఎల్ సమయంలోనూ వీరిద్దరూ ఒకరిపై మరొకరు వేసుకున్న పంచ్ లు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Niharika Konidela: అమ్మాయిల్లో నేను ఆ టైప్ అంటున్న మెగా డాటర్
శనివారం వీరిద్దరూ స్టైల్ షర్టులు ధరించి ఓ హోటల్ కు లంచ్ చేయడానికి వెళ్లారు. వారిద్దరికీ ఇష్టమైన సుషీ డిష్ ను తింటూ.. కెమెరాకు ఫోజులు ఇస్తూ.. ఎంజాయ్ చేశారు. ఇదంతా ఒకవైపు ఐతే.. మరోవైపు ముంబయి ఇండియన్స్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పసిగట్టింది. లంచ్ చేస్తూ దిగిన ఫొటోలో ఇషాన్ కిషన్ ధరించిన షర్ట్ గతంలో శుభ్ మన్ గిల్ తన ప్యారిస్ ట్రిప్‌లో ధరించినట్టు గుర్తించారు. కొన్ని రోజుల కింద శుభ్ మన్ గిల్ ప్యారిస్‌కు వెళ్లినప్పుడు ఇదే షర్ట్ ధరించిన ఫొటోను తీసుకున్నారు. అదే షర్ట్‌ను ఇప్పుడు ఇషాన్ కిషన్ ధరించారు.
అంతేకాకుండా శుభ్ మన్ గిల్ పై కిషన్ చేసిన కామెంట్ కూడా వైరల్ అయింది. ‘బ్రో.. ఆ షర్ట్ వెస్టిండీస్‌కు తీసుకురావా? దాని కోసం ఇక్కడ ఎక్కడపడితే అక్కడే వెతుకుతున్నా’ అంటూ కామెంట్ చేశాడు. దానికి గిల్ కూడా ఫన్నీ కామెంట్ చేశాడు. ‘హా.. హా.. మరి నా కోసం ఆ షర్ట్ ప్యాక్ చేశావు. అబద్ధాలకోరు’ అంటూ కామెంట్ చేశాడు.
