Site icon NTV Telugu

Yogi Adityanath: దీపావళికి అంతరాయం కలిగిస్తే జైలుకే.. సీఎం యోగి స్ట్రాంగ్ వార్నింగ్..

Yogi

Yogi

Yogi Adityanath: దీపావళికి ముందు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆందోళనకారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పండుగ వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే జైలు పాలు కావడం ఖాయమన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవని.. వెంటనే జైలులో పెడతామని హెచ్చరించారు. పండుగలు, వేడుకలను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని సీఎం యోగి సూచించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్‌లోని అన్ని సమాజిక వర్గాలకు చెందిన ప్రజలు పండుగలను శాంతియుతంగా జరుపుకున్నారన్నారు. ఇది అల్లర్లకు తలొగ్గే ప్రభుత్వం కాదన్నారు. లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

READ MORE: Dhanteras 2025: ధన త్రయోదశి రోజున బంగారం కొనేందుకు శుభసమయం ఇదే.. ఇక లక్ష్మీదేవి మీవెంటే!

అంతకుముందు, దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌లోని సుమారు 1.482 మిలియన్ల ఉద్యోగులకు ఆర్థిక బహుమతిని ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బోనస్‌లను అందించాలని నిర్ణయించారు. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి రూ.6,908 ప్రయోజనం లభిస్తుంది. మొత్తం ఖర్చు రూ.1,022 కోట్లు. అదనంగా, ఉజ్వల యోజన కింద, రాష్ట్రంలోని 18.6 మిలియన్ల తల్లులు, సోదరీమణులు రెండు ఉచిత LPG సిలిండర్లను అందుకుంటారు. ఈ ఆర్థిక సంవత్సరం ఈ పథకానికి రూ.1,500 కోట్లు కేటాయించారు.

READ MORE: BC Leaders Fight: బీసీ సంఘాల ప్రతినిధులు మధ్య తోపులాట.. చెయ్యి చేసుకున్న నేతలు

Exit mobile version