అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ వచ్చాయని, బీఆర్‌ఎస్.. బీజేపీ అధర్మ యుద్ధానికి తెర లేపినా మా బలం పెరిగిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ సీటు కూడా గెలిచామని, ప్రజల కోసం పని చేస్తోంది ప్రభుత్వమన్నారు. బీజేపీ నేతలు నోరుంది కదా అని నోరు పారేసుకోవద్దని, బీజేపీ ది బలుపు కాదు వాపు అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైనా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుందని, 2019 లో కూడా ఇట్లనే మాట్లాడారు కన్ను మిన్ను కానకుండా మాట్లాడారన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ పునరుద్ధరణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా.. నూతన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎలక్షన్ కోడ్ కారణంగా వేలాది సీఎంఆర్ఎఫ్ లు నిలచిపోయాయని, గత ప్రభుత్వంలో జారీ చేసి మధ్యలో నిలిపివేసిన సుమారు 60 వేల సీఎం ఆర్ఎఫ్ లను లబ్ధిదారులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేవించనట్లు ఆయన తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ప్రభుత్వం చేయనుందని, మోడీ.. రాములవారి పేరు.. కేసీఆర్ సపోర్ట్ తో బీజేపీ కి వచ్చిన ఓటు 35 శాతం అని ఆయన అన్నారు. వాపు చూసి బలుపు అనుకోకండని, కేసీఆర్ సారథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ కుప్పకూలిందన్నారు. పార్టీ అధ్యక్షుడుని మార్చుకోండని ఆయన అన్నారు. కేసీఆర్.. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ పూర్తిగా దెబ్బతిన్నదని, దళితున్నో.. బీసీ నో అధ్యక్షుడు గా పెట్టుకోండన్నారు. అహంకారంతో విర్రవీగే ఏ నాయకుడు అయినా కర్రుకాల్చి వాత పెడతారు జనం అని, ఇక్కడ కేసీఆర్.. జగన్ లకు దారుణ శిక్ష వేశారు ప్రజలు అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ఇష్టారాజ్యంగా పార్టీలను కూల్చుతూ.. సీబీఐ.. ఈడీలను వాడుతూ వచ్చినందుకు బీజేపీకి గుణపాఠం చెప్పారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
