మరో రెండు రోజుల్లో పాత ఏడాది పోయి, కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం.. ప్రతి ఏడాది చివర్లో సంవత్సరంలో జరిగిన చిత్ర, విశేషాలు నెమరేసుకుంటూ ఉంటాము.. ఇప్పటికే ఎన్నో విషయాల గురుంచి తెలుసుకున్నాం.. ఇప్పుడు ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టిన టీమ్ ఇండియా క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
2023 జనవరి 23న టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ యాక్టర్ బాలీవుడ్ నటి అథియా శెట్టిని వివాహం చేసుకున్నాడు..
ఆ తర్వాత అదే నెలలో మరో క్రికెటర్ జనవరి 27న స్టార్ ఆల్ రౌండర్ అక్షర పటేల్ తన స్నేహితురాలు మేహా పటేల్ ని పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాడు..
ఇక జూన్ 3న బ్యాట్స్ మెన్ రుతురాజ్ గైక్వాడ్, ఉత్కర్ష పవార్ లు పెళ్లి చేసుకున్నారు. ఇక ఫిబ్రవరి 27న భారత ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్, మిథాలి పారుల్కర్ లు వివాహం చేసుకున్నారు..
ఇక ఈ ఏడాది చివర్లో నవంబర్ 24న ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ తన స్నేహితురాలు స్వాతి ఆస్థానాలను వివాహం చేసుకుని బ్యాచ్లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేశాడు.
అలాగే నవంబర్ 28న భారత ఫేసర్ ముఖేష్ కుమార్ ముఖేష్ దివ్యసింగ్ ల వివాహం జరిగింది. జూన్ 8వ తేదీన భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ, రచనల వివాహం జరిగింది.వీరంతా ఈ ఏడాదిలో బ్యాచ్లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేశారు..