Site icon NTV Telugu

Nara Lokesh: విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారు.. ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు!

Nara Lokesh

Nara Lokesh

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి.. కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు అని పేర్కొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారన్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయని.. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు అని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి లోకేశ్‌ చెప్పుకొచ్చారు.

Also Read: CM Chandrababu: ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు.. నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు!

‘ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయి. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు. ప్రజా తీర్పు మా కూటమి బాధ్యతను మరింత పెంచింది. చంద్రబాబు గారి పాలనానుభవం, పవనన్న ఆశయానికి మోదీ గారి ఆశీస్సులు పుష్కలంగా లభించడంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభమైంది. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తితో మాకు అండగా నిలుస్తారని కోరుతున్నాను. ప్రజా తీర్పుదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’ అని మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

Exit mobile version