ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాల్లో స్పీడు పెంచాయి. ఈ క్రమంలో.. తిరుపతిలో యాదవ సంఘాలతో వైసీపీ, టీడీపీ పోటాపోటీ సమావేశాలు నిర్వహించింది. యాదవ, కురుబ సమ్మేళనం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి నగరం ఎన్నడూ లేని విధంగా మహా నగరంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
Read Also: MLA Koneti Adimulam: తీవ్ర అసంతృప్తిలో సత్యవేడు ఎమ్మెల్యే.. మంత్రిపై గరం గరం..!
తిరుమల శ్రీవారిని తొలిసారిగా చూసిన “శరభయ్య” విగ్రహం త్వరలో తిరుపతిలో ఏర్పాటు చేస్తామని భూమన తెలిపారు. తిరుపతి నగరంలో నూతనంగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రహదారులకు యాదవ ప్రముఖుల పేర్లు పెట్టామని పేర్కొన్నారు. యాదవులకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశామని చెప్పారు. మేయర్ పదవి, యాదవులకు 9 కార్పొరేటర్ లు, సన్నిధి గొల్ల సమస్య పరిష్కారం చూపామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భూమన అభినయ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
Read Also: Jaipur: టీనేజ్ బాలికపై మామ, అతని కొడుకు అత్యాచారం.. పరువు కోసం గర్భం తీయించిన కుటుంబం..