Site icon NTV Telugu

TDP vs YCP Fight: జమ్మలమడుగులో వైసీపీ- టీడీపీ- బీజేపీ నాయకులు రాళ్లతో దాడి

Jammalamadugu

Jammalamadugu

TDP vs YCP Fight: కడప జిల్లా జమ్మల మడుగులో నిన్న ( సోమవారం ) వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్ కేంద్రం దగ్గర వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య తోపులాట, రాళ్లదాడి చేసుకున్నారు. నేడు మళ్ళీ తిరిగి కవ్వింపు చర్యలకు వైసీపీ, టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన స్వగ్రామమైన నిడిజివ్వి గ్రామం నుంచి దాదాపు 30 వాహనాలలో తన శ్రేణులతో కలిసి జమ్మలమడుగు వైపు రావడానికి ప్రయత్నం చేశారు. ముద్దనూరులో వైసీపీ నేత ముని రాజా రెడ్డి ఇంట్లో సుధీర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Read Also: Monsoon: సమయం కంటే ముందే దేశంలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ..

మరోవైపు మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి కూడా తన శ్రేణులతో ముద్దనూరుకు పోవడానికి సిద్ధం కావడంతో పోలీసులు ఆయనకు సర్ది చెబుతున్నారు. దేవగుడిలోనే ఆది నారాయణ రెడ్డి, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేశారు. ఇక, జమ్మలమడుగు తెలుగు దేశం పార్టీ కార్యాలయం దగ్గరకు భారీగా ఎన్డీయే కూటమికి చెందిన కార్యకర్తలు చేరుకుంటున్నారు. జమ్మలమడుగు, ముద్దనూరు మార్గ మధ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పలు చోట్ల పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి.. టీడీపీ- బీజేపీ- వైసీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.

Exit mobile version