NTV Telugu Site icon

YCP : నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర

Ycp Bus Yatra

Ycp Bus Yatra

మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అక్టోబర్ 26 నుంచి సామాజిక సాధికార యాత్ర పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.ప్రతిపాదిత బస్సు యాత్ర ఉత్తర ఆంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతంతో సహా మూడు ప్రాంతాల నుండి ప్రారంభమవుతుంది. ఇది డిసెంబర్ చివరి వరకు కొనసాగుతుంది.అందులో భాగంగానే ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం, రాయలసీమలోని సింగనమల, కోస్తా ప్రాంతంలోని తెనాలి నుంచి యాత్రను ప్రారంభించేందుకు పార్టీ బస్సులను సిద్ధం చేసింది. మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో బస్సు యాత్రలు ప్రారంభంకానున్నాయి. ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం, కోస్తా ఆంధ్రలోని తెనాలి, రాయలసీమలోని సింగనమల నుంచి బస్సు యాత్రలు ప్రారంభమవుతాయి. నాలుగున్నరేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై ప్రచారం చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరిస్తామన్నారు. ప్రతిరోజూ మూడు ప్రాంతాల్లో మూడు సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో బస్సుయాత్రలు ప్రారంభం కాగా.. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా బస్సుయాత్రలు నిర్వహించనున్నారు.

Also Read : Gold Price Today : మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంత ఉందంటే?

ప్రతిరోజూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో… మూడు బహిరంగ సభలను నిర్వహిస్తారు. సామాజిక బస్సు యాత్ర మూడు దశల్లో జరుగనుంది. గురువారం నుంచి ప్రారంభం అయ్యే ఫస్ట్ ఫేజ్ నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఈనెల 27న గ‌జ‌ప‌తి న‌గ‌రం, న‌ర‌సాపురం, తిరుప‌తి, 28న భీమిలి, చీరాల, పొద్దుటూరు, 30న పాడేరు, దెందులూరు, ఉద‌య‌గిరిలో యాత్ర కొనసాగుతుంది. ఈనెల 31న క్యాబినెట్ సమావేశం ఉండటంతో యాత్రకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి న‌వంబ‌ర్ 1న పార్వతీపురం, కొత్తపేట, క‌నిగిరి, 2న మాడుగుల, అవ‌నిగ‌డ్డ, చిత్తూరు, 3న న‌ర‌స‌న్నపేట, కాకినాడ రూర‌ల్, శ్రీకాళ‌హ‌స్తి, 4న శృంగ‌వ‌ర‌పుకోట, గుంటూరు ఈస్ట్, ధ‌ర్మవ‌రం, 6న గాజువాక, రాజ‌మండ్రి రూర‌ల్, మార్కాపురం, 7న రాజాం, వినుకొండ, ఆళ్లగ‌డ్డ, 8న సాలూరు, పాల‌కొల్లు, నెల్లూరు రూర‌ల్‌లో కొనసాగుతుంది. నవంబ‌ర్ 9న అన‌కాప‌ల్లి, పామ‌ర్రు, తంబ‌ళ్లప‌ల్లెలో యాత్ర ముగుస్తుంది. సామాజిక సాధికార యాత్ర డిసెంబర్ 31 వరకు అంటే.. మొత్తంగా 60 రోజుల పాటు బస్సు యాత్ర జరుగనుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్రను కొనసాగే విధంగా షెడ్యూల్ తయారు చేశారు.

Also Read : Ooru Peru Bhairavakona : సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..