నూజివీడు టీడీపీలో పార్థసారధి రచ్చ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి నూజివీడు టీడీపీ నేతలకు ఫోన్లు చేసి.. నూజివీడు సీటు తనకే అని సహకరించాలని ఫోన్ లో కోరారు పార్థసారధి. సారధి ఫోన్ కాల్స్ పై నూజివీడు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరక ముందే సారధి తమ వాళ్ళకు ఫోన్లు చేయటం సరికాదని సూచించారు. సీటు ఏమన్నా ఇస్తే పార్టీ ప్రకటన ఉంటుంది.. అలాంటిది ఏం లేకుండా సారధే చెప్పుకోవటం సరికాదని అన్నారు. పార్టీలో చేరని వ్యక్తికి సీటు ఇచ్చారని చెప్పటం ఎంత వరకు కరెక్ట్ ? అని ప్రశ్నించారు.
వైసీపీలో ఎమ్మెల్యేగా ఉండి టీడీపీలో సీటు అని చెప్పటం ఏంటి అని అన్నారు. ఇది వైసీపీ కుట్రని అనుకుంటున్నట్లు ముద్దరబోయిన తెలిపారు. సీటుపై నిర్ణయం జరిగి ఉంటే తమతో అధిష్టానం మాట్లాడుతుందని అన్నారు. పార్టీలోకి ఆయన ఇంత వరకు రానేలేదు.. పార్టీలో చేరన తర్వాత సీటు ఆశించాడా అంటే పార్టీలో చేరలేదన్నారు. చంద్రబాబు గతంలో నూజివీడు పర్యటనలోనే తాను అభ్యర్థిని అని చెప్పారని పేర్కొన్నారు. తానే నూజివీడు కాబోయే ఎమ్మెల్యే అని చంద్రబాబు మాటిచ్చారని ముద్దరబోయిన తెలిపారు.
Read Also: Utsavam Teaser: కళాకారుడు చనిపోవచ్చుగానీ కళ చనిపోకూడదు
పార్టీలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనే దానిపై అధిష్టానం నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. రెండుసార్లు ఓడిపోయినా.. తాను పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నానని తెలిపారు. తమ వాళ్ళకు సారధి ఫోన్ చేసిన మాట వాస్తవమే.. తనకు సీటు వస్తుందని చెబితే సరిపోతుందా దానికి ఆధారం ఉండాలి కదా అని ముద్దరబోయిన పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిని కూడా సారధి విషయమై అడిగితే అలాంటిది లేదని చెప్పారని ముద్దరబోయిన వెంకటేశ్వర్లు తెలిపారు.