Utsavam Teaser: కళాకారుడు చనిపోవచ్చుగానీ కళ చనిపోకూడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Utsavam Teaser: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అతిధులుగా హాజరైన ఈ టీజర్ లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది.
‘కళాకారుడు చనిపోవచ్చుగానీ కళ చనిపోకూడదు’ అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనుభూతిని ఇచ్చింది. టీజర్ లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాజర్, రాజేంద్ర ప్రసాద్, ఎల్.బి. శ్రీరామ్, అలీ, ప్రేమ, ఆమని, ప్రియదర్శి లాంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో కనిపించడం కన్నులపండగలా వుంది. యంగ్ హీరో దిలీప్ ప్రకాష్ స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా వుంది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా పాత్రలని ప్రజెంట్ చేసిన తీరు చాలా ఆసక్తిరకంగా వుంది. దర్శకుడు అర్జున్ సాయి ఇంతమంది వెర్సటైల్ యాక్టర్స్, వారి పాత్రల్లోని ఎమోషన్ ని టీజర్ లో అద్భుతంగా చూపించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మనసుని హత్తుకునేలా వుంది. రసూల్ ఎల్లోర్ వండర్ ఫుల్ విజువల్స్ అందించారు. ప్రొడక్షన్ డిజైన్, నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి టీజర్ ‘ఉత్సవం’పై చాలా ఆసక్తిని పెంచింది.
Also Read
- Dhanush-Mammootty: మమ్ముట్టి సర్.. మరోసారి ఇలా రాకండి ప్లీజ్.. ధనుష్ కామెంట్స్ వైరల్!
- Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
- Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. నటులు, నట జీవితం అంటే నాకు ఒక ఎమోషనల్ ఎటాచ్మెంట్. ఆర్ట్ ఈజ్ లాంగ్.. లైఫ్ ఈజ్ షార్ట్. చివరి వరకూ మిగిలిపోయేది కళ మాత్రమే. కళా కారులందరినీ ఒక్క చోటికి చేర్చి వీరిపై ఒక సినిమా చేయాలని ఆలోచన చేసిన దర్శకుడు అర్జున్ సాయికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమాలు ఎన్నుకోవాలంటే ధైర్యంతో పాటు సినిమాటిక్ గా చెప్పే నేర్పు కావాలి. ఇంతమంది నటీనటులని ఒక్క చోటికి చేర్చి చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అందరూ అద్భుతమైన నటన ప్రదర్శించారు. నిజంగా ఈ సినిమా ‘ఉత్సవం’లా వుంటుంది. ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. విభిన్నమైన కథలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కళకు ఆయువుపట్టు నాటకరంగం. తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. హీరో దిలీప్ చక్కని నటన కనపరిచాడు. రంగస్థలం గురించి, ఈ సినియా గురించి దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ‘ఉత్సవం’ తీర్చిదిద్దారు. తప్పకుండా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది” అన్నారు.
హీరో దిలీప్ మాట్లాడుతూ.. కలర్ పుల్, ఎమోషనల్ జర్నీ, కంటెంట్ బేస్డ్ ‘ఉత్సవం’ సినిమాతో పరిచయం కావడం గర్వంగా, గౌరవంగా వుంది. నన్ను నమ్మి ప్రోత్సహించిన నిర్మాతకు కృతజ్ఞతలు. మా సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులు ఆశీస్సులు, ఆదరణ మా సినిమా కావాలి” అని కోరారు.
నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. సినిమాకి మూలమే నాటకరంగం. ఈ టీజర్ లోని మొదటి డైలాగే చాలా ఆకట్టుకునేలా వుంది. ఇంతమంది లెజెండరీ నటులతో ఈ చిత్రాన్ని రూపొందించడం చాలా విశేషం. ఇంత మంచి కళాత్మక చిత్రానికి దర్శకత్వం వహించిన అర్జున్ సాయి కి అభినందనలు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు
దర్శకుడు అర్జున్ సాయి మాట్లాడుతూ.. గత పదేళ్ళుగా పరిశ్రమలో సహాయ దర్శకుడిగా, రచయితగా పని చేశాను. దర్శకుడిగా ఇది ఉత్సవం నా తొలి చిత్రం. టీజర్ లాంచ్ చేసిన బ్రహ్మానందం గారు, నిర్మాత ఏఎం రత్నం గారికి కృతజ్ఞతలు” తెలిపారు.
ప్రముఖ నటుడు ఎల్. బీ శ్రీరామ్ మాటాడుతూ.. నాటకానికి సంబంధించి ఎన్నో మంచి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఉత్సవం వస్తోంది. సినిమా చాలా బావుంటుంది. నాటకం అమ్మలాంటింది. నాటకం నుంచి పుట్టిన అనేక రూపాలే నేటి కళారూపాలు. తల్లిని గౌరవించినపుడే మనికి ‘ఉత్సవం” అన్నారు
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఉత్సవం హార్ట్ టచ్చింగ్ సబ్జెక్ట్. చాలా పెద్ద నటీనటులు ఇందులో వున్నారు. అర్జున్ చాలా అద్భుతంగా సినిమాని తీశారు. ఇందులో చాలా పాటలు వున్నాయి. నేను చేసిన సినిమాల్లో ఉత్సవం కూడా మంచి ఆల్బమ్స్ అవుతుందని నమ్ముతున్నాను” అన్నారు. అనంతశ్రీరాం, లక్ష్మీ భూపాలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Dhanush-Mammootty: మమ్ముట్టి సర్.. మరోసారి ఇలా రాకండి ప్లీజ్.. ధనుష్ కామెంట్స్ వైరల్!
-
ZP Chairman Elections: జెడ్పీ చైర్మన్ పదవులపై ఉత్కంఠ.. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఇంకా రాని క్లారిటీ..!
-
Electric Shock: విద్యుత్ తీగ తగిలి విద్యార్థిని మృతి, మరో బాలికకు గాయాలు..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
AP Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. నేటితో నామినేషన్లకు తెర
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!