Site icon NTV Telugu

YSRCP: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్..

Ysrcp

Ysrcp

ఇటీవల పార్లమెంట్‌ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ చట్టం, 2025 అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్‌ 8 నుంచే ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇటీవల పార్లమెంట్‌ ఉభయ సభల నుంచి ఈ బిల్లు పాస్‌ అవ్వగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్‌ (సవరణ) బిల్లు చట్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాగా.. ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా వక్ఫ్ చట్ట సవరణను వైసీపీ సైతం వ్యతిరేకించింది. పార్లమెంట్‌లో కూడా పార్టీ ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు. వైసీపీ వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో
పిటిషన్ దాఖలు చేసింది.

READ MORE: Amithabachan : ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి.. ఫ్యాన్స్ కు అమితాబ్ ప్రశ్న..

మరోవైపు.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై విపక్ష పార్టీల ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు కాగా.. వీటిపై సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్‌ 16న విచారణ జరపనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కేవియట్‌ను దాఖలు చేసింది. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయొద్దని కోరింది.

 

Exit mobile version