రాష్ట్రపతి, ప్రధానితో పాటు, కేంద్ర హోంమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏపీ గవర్నర్, ఏపీ డీజీపీ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారులపై రాజ్యాంగ విరుద్ధ చర్యలు తీసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. 2024 జూన్ నుంచి మొత్తం 199 మంది పోలీసు అధికారులను పోస్టింగ్‌లు లేకుండా “వెయిటింగ్”లో ఉంచి జీతాలు కూడా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. మొత్తంలో 199 మంది పోలీసు అధికారుల్లో, నలుగురు ఐపీఎస్‌లు, 4 నాన్-కేడర్ ఎస్పీలు, 27 అడిషనల్ ఎస్పీలు, 42 డీఎస్పీలు, 119 సివిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారన్నారు. ఈ అధికారులందరినీ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ పని లేకుండా రోజూ హాజరౌతున్నట్లు సంతకాలు తప్ప, ఏ బాధ్యతలూ ఈ పోలీసు అధికారులకు ఇవ్వలేదని పేర్కొన్నారు.
READ MORE: Liquor Scam Case: క్లైమాక్స్‌కి చేరిన లిక్కర్ స్కాం కేసు.. విచారణలో కీలక విషయాలు..
ఈ పోలీసు అధికారులకు 12 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం రాజ్యాంగం లోని ఆర్టికల్స్ 14, 16, 21కి విరుద్ధం. ఫీల్డ్ డ్యూటీల్లో “నాన్ పోస్టెడ్” పోలీసులను వినియోగిస్తున్నారు. అలవెన్స్ లేకుండా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా స్వయంగా భరిస్తున్నారు. కేంద్రం, ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను రప్పించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో 199 మంది పోలీసు అధికారులకు ఏ బాధ్యతలు ఇవ్వకుండా ఉంచడం అన్యాయం. వెంటనే ఈ పోలీసు అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వాలి. తక్షణమే పెండింగ్ జీతాలు విడుదల చేయాలి. పెన్షన్ కాంట్రిబ్యూషన్లు తిరిగి ప్రారంభించాలని లేఖలో ప్రస్తావించారు.
READ MORE: Infiltrators: అక్రమ బంగ్లాదేశీలపై త్రిపుర ఉక్కుపాదం, టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..