Site icon NTV Telugu

Gorantla Madhav: వీడియోను సృష్టించిన వారిపై పరువునష్టం దావా వేస్తా.. వాడొక అరగుండు వెధవ

Gorantla Madhav

Gorantla Madhav

Gorantla Madhav: ఓ మహిళతో నగ్నంగా తాను మాట్లాడిన వీడియో ఫేక్ అని అనంతపురం ఎస్పీనే నిర్ధారించారని.. ఈ వీడియో మార్ఫింగ్ అని తాను ఆనాడే చెప్పానని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించారు. ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కొంతమంది దుర్మార్గులు కలిసి చేసిన పని అని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి ఈ కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. బీసీలు ఎదుగుతుంటే చూసి టీడీపీ ఓర్వలేక పోతుందని ఆరోపించారు. ఈ వీడియో బహిర్గతం అయిన దగ్గర నుంచి తానేమీ టెన్షన్ పడలేదని.. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని గట్టిగా విశ్వసించానని పేర్కొన్నారు. ఈ వీడియో వచ్చాక తన పని తాను చేసుకున్నట్లు గుర్తుచేశారు. తాను రెగ్యులర్‌గా పార్లమెంట్‌కు కూడా హాజరైనట్లు వివరించారు.

Read Also: Ananthapuram SP: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు

అటు చంద్రబాబును ఉద్దేశించి ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓ ముండా కొ…కు అని దూషించారు. అయ్యన్నపాత్రుడిని ఓ అరగుండు వెధవ అని దుర్భాషలాడారు. వాడు అబద్ధపు వీడియోను నిజం అని నమ్మించడానికి ప్రయత్నించాడని మండిపడ్డారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయాడని.. ఆ కేసు కారణంగా తెలంగాణ నుంచి ఇక్కడకు వచ్చి పడ్డాడని గోరంట్ల మాధవ్ విమర్శలు చేశారు. చంద్రబాబు అంత నీతిమంతుడు అయితే తన ఆడియోను స్వయంగా ఫోరెన్సిక్ అధికారులకు ఎందుకు అప్పగించలేదని సూటిగా ప్రశ్నించారు. పడిపోయిన పార్టీని చంద్రబాబు, లోకేష్ ఎంత లేపడానికి ప్రయత్నించినా ఉపయోగం లేదన్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడిని సొంత నియోజకవర్గంలోనే ప్రజలు నిలదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌న‌పైనే ఈ వీడియో ఎందుకు సృష్టించార‌న్న విష‌యాన్ని వీడియోను అప్‌లోడ్ చేసిన వారినే అడ‌గాలంటూ జర్నలిస్టులకు ఎంపీ గోరంట్ల మాధవ్ హితబోధ చేశారు. చంద్రబాబు, లోకేష్, కొందరు మీడియా ప్రతినిధులు తనపై కుట్ర చేశారని ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన వీడియో ఫేక్ అని నిర్ధారణ కావడంతో చంద్రబాబు ముక్కు నేలకు రాసి, తనకు క్షమాపణ చెప్పాలన్నారు. నీచపు రాజకీయాలకు చంద్రబాబు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు తన బొచ్చు కూడా పీకలేరని వ్యాఖ్యానించారు.

https://www.youtube.com/watch?v=J5sYTsBVWhs

Exit mobile version