Site icon NTV Telugu

Supreme Court: పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

Sc

Sc

Supreme Court: నేడు సుప్రీంకోర్టులో పోస్టల్ బ్యాలెట్ కేసుపై విచారణ సాగనుంది.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. వైసీపీ తరఫున పిటిషనర్‌గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు.. అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలన్న ఎన్నికల కమిషన్‌ నిబంధనను సవాల్ చేస్తూ.. ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.. అయితే, ఇదే వ్యవహారంలో మొదట ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది.. ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ వైఎస్సార్సీపీ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం విదితమే కాగా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేతలు.. ఇక, ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్.. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ఎదుట విచారణ ప్రారంభం కానుంది.

Read Also: V. Hanumantha Rao: గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చాయి..

Exit mobile version