విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాట్లాడుతూ.. జనసేన పార్టీ లేదు, గుర్తింపు లేదు జగన్ మోహన్ రెడ్డి మీద తొడ కొడతాడంట అని విమర్శించారు. ఈరోజు నీ గ్లాస్ నీ దగ్గర లేదని దుయ్యబట్టారు. ఎప్పుడైతే చంద్రబాబుకి బానిసలా బతుకుతున్నావో.. నీ జీవితం ఎలా అయిపోయిందో తెలుసని ఆరోపించారు. నిన్ను నమ్ముకొని 10 సంవత్సరాలు జనసేన జెండా పట్టుకున్నారు.. గ్లాస్ పట్టుకున్నారు.. గ్లాస్ ని అందరికీ ఇచ్చేశావ్.. జెండాను చంద్రబాబుకి తాకట్టు పెట్టావని పేర్కొన్నారు.
Mobile Hacking: ఫోన్లో ఇలాంటివి వాడుతున్నారా ? అయితే డేటా లీకయ్యే ఛాన్స్..తస్మాత్ జాగ్రత్త..
చంద్రబాబు మేనిఫెస్టో 2014కి 2024కి తేడా ఉందా అని ప్రశ్నించారు. అదనంగా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇందులో యాడ్ చేశాడని వెల్లంపల్లి తెలిపారు. 2014లో ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా.. నిరుద్యోగ భృతి అన్నాడు ఇచ్చాడా ఇందులో ఏం చేశాడు.. మళ్లీ ఇప్పుడు ప్రజలను మోసం చేద్దాం అనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చిత్తు కాగితంలా చూస్తారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్లా చూస్తారని తెలిపారు.
Sanju Samson: శ్రమ, చెమటతో కుట్టిన చొక్కా.. సంజు శాంసన్ ఎమోషనల్ పోస్ట్..
జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అమలుపరుస్తారని నమ్మకం అని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చెత్త బుట్టలో వేసే మేనిఫెస్టో అని విమర్శించారు. దీనికి పవన్ కళ్యాణ్ యాడ్ అయ్యాడు ఇద్దరు చెత్త బుట్టేనని ఆరోపించారు. జూన్ 4 తర్వాత ఇద్దరినీ చెత్తబుట్ల వేస్తారు ప్రజలు అని పేర్కొన్నారు.