అమరావతి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. మంత్రి జోగి రమేష్ సహా పలువురు ప్రజా ప్రతినిధుల హాజరయ్యారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ.. విజయవాడ నగరం వంగవీటి మోహన రంగా అడ్డా అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు వంగవీటి మోహన్ రంగా ఒక ఐకాన్ అని, రంగా రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారన్నారు. కష్టం ఎక్కడుంటే అక్కడ రంగా ఉండేవారని, కాపులంతా ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంతేకాకుండా.. ‘మనకు మంచి చేస్తున్న వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. రంగాను టీడీపీ పార్టీ మట్టు బెట్టించింది. చంద్రబాబు కుట్రతోనే రంగా హత్య జరిగింది. ఈ రాష్ట్రంలో కాపులపై కుట్ర జరుగుతోంది. రంగా ధ్యేయం టీడీపీ పార్టీ పతనం. వంగవీటి మోహనరంగా అభిమానులుగా మన లక్ష్యం కూడా అదే. కాపు సామాజికవర్గానికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. రంగా ఆశయాలను కొనసాగిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.’ అని ఆయన అన్నారు.
Also Read : Road Accident: ముంబై-ఆగ్రా హైవేపై ఘోర ప్రమాదం.. హోటల్‌లోకి కంటైనర్.. 12 మంది మృతి
అనంతరం గుంటూరు మేయర్ కావటి మనోహర్ మాట్లాడుతూ.. వంగవీటి మోహనరంగాను మట్టు బెట్టింది టీడీపీ, చంద్రబాబు అని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రంగా.. ఇవాళ సాయంత్రంలోగా చంద్రబాబు కానీ, టీడీపీ నేతలు కానీ రంగా విగ్రహానికి నివాళులర్పించగలరా..? అని అన్నారు. కాపులకు మేలు చేసింది ఆనాడు వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన అన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చనిపోయి 30 ఏళ్లు దాటినా రంగా ఇప్పటికీ అందరి గుండెల్లో ఉన్నారని, రంగాను ఎవరు చంపారో.. చంపించారో.. అందరికీ తెలుసునన్నారు. ప్రజలున్ని విషయాలు మర్చిపోతారనే ఆలోచనలో టీడీపీ నేతలున్నారు. రంగా విధానాలను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. కాపులకు అండగా నిలిచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Tamilnadu: ఏడేళ్లలో.. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తమిళనాడు!