Tadipatri riots: అనంతపురం జిల్లా తాడిపత్రిలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే.. అయితే, ఆ ఘటనలపై మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు.. టీడీపీపై మండిపడ్డారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రిలో టీడీపీ హింసా రాజకీయాలను ఖండిస్తున్నాం.. ఎస్పీ అమిత్ బర్దర్ సమక్షంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్ పై దాడి జరిగింది.. ఎస్పీ అమిత్, ఏఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించారు.. పోలీసుల సహకారంతోనే తాడిపత్రి లో వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు జరిగాయి.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దౌర్జన్యం అమానుషం.. ఏఎస్పీ రామకృష్ణని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు..
Read Also: Jr NTR-Neel Movie: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా?
ఇక, ఉరవకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే టీడీపీ హింస రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.. చంద్రబాబు డైరెక్షన్లో ఇష్టారాజ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం వల్లే ఎన్నికల్లో హింస చెలరేగిందన్న ఆయన.. రౌడీషీటర్లు, ఖూనీకోర్లను పయ్యావుల కేశవ్ పోలింగ్ ఏజెంట్లు గా పెట్టారని ఆరోపించారు. తాడిపత్రిలో టీడీపీ అరాచకాలకు పోలీసులే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. వైఎస్సార్ సీపీ శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు మాట్లాడుతూ.. టీడీపీ – జనసేన – బీజేపీలకు ఓటమి భయం పట్టుకుందన్నారు.. అందుకే వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి పిరికిపంద చర్యగా భావిస్తున్నాం అన్నారు శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు. ఇక, వైసీపీ నేతలు మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..