గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. దేవర చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అదే విధంగా బాలీవుడ్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టింది.. ఈ రెండు సినిమాలు అవ్వగానే ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చెబోతున్నాడు.. ఆ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ 31 పేరిట మొదలుకానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.. ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చెయ్యనున్నట్లు ఓ వార్త షికారు చేస్తుంది. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకూ తన చిత్రాలన్నింటికీ కాస్త వెరైటీ టైటిల్స్‌యే పెట్టారు నీల్. కేజీఎఫ్, సలార్ ఇలా ఈ పేర్లను పెట్టారు. అలాగే డ్రాగన్ అనే పేరుకు సినిమా స్టోరికి ఏదైన లింక్ ఉందేమో చూడాలి..
ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం సలార్ 2 షూటింగ్ మొదలుపెట్టేందుకు నీల్ రెడీగా ఉన్నారు. ఈ నెలాఖరులో సలార్ 2 షూటంగ్ మొదలవబోతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళాలనే ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్.. ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తున్నాడో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.