Anil Kumar Yadav: తన రాజకీయ జీవితం జగన్ పెట్టిన భిక్ష అని నరసరావు పేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తాను రాజకీయాలకు వచ్చేటప్పటికి ఒంటరినని తెలిపారు. కోటప్పకొండ శివుడు సాక్షిగా చెబుతున్నా.. నాకు ఎవరూ లేకపోయినా తండ్రి లాగా, సాక్షాత్తు దైవంలాగా సీఎం జగన్ నన్ను ఆదరించారని ఆయన వెల్లడించారు. అలాంటి వ్యక్తి నన్ను పల్నాడు వెళ్లి పోటీ చేయమంటే ఎందుకు ఆగుతానని అన్నారు. నేను ముక్కుసూటిగా మాట్లాడుతాను, నెల్లూరు రాజకీయాలకు పనికిరాని అన్నారు.. అందుకే నన్ను జగనన్న పల్నాడుకి పంపించారని చెప్పారు. అన్న ఆదేశిస్తే నరసరావుపేట కాదు, వైసీపీ ఓడిపోయే సీటు ఏదైనా ఉంటే అక్కడికి వెళ్లి కూడా పోటీ చేస్తానన్నారు.
Read Also: Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో డీజిల్ దొంగ ఎవరో ప్రజలకు తెలియాలి..
తాను ఎమ్మెల్యే అవుతాను అనుకోలేదని, అయ్యానని… మంత్రి అవుతానని అనుకోలేదని అయ్యానని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఎంపీ అవ్వాలని రాసిపెట్టి ఉంది అందుకే పల్నాడు వచ్చానన్నారు. నెల్లూరులో తన నియోజకవర్గాన్ని వదిలి వస్తున్నా అన్న బాధ కలిగిందన్నారు. కానీ పల్నాడు గడ్డమీద అడుగుపెట్టగానే ఆ బాధ మొత్తం పోయిందన్నారు.పల్నాడు ప్రాంత ప్రజల అభిమానంతో బాధ మొత్తం పోయిందన్నారు. జగనన్న గీత గీసిన తర్వాత అది దాటేది లేదు.. అందుకే జగన్ ఎంపీగా వెళ్ళమన్నారు పల్నాడు ఎంపీగా వచ్చేశానన్నారు.
అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “జగన్ అన్న ఆదేశించాడని నెల్లూరులో నా సర్వస్వాన్ని వదిలి వచ్చేసా.. పల్నాడు ప్రజలు, శాసన సభ్యులు నన్ను గెలిపిస్తారో, ఓడిస్తారో మీ ఇష్టం. మీ కుటుంబంలో ఒకడిలా ఉందామనుకున్నా. నా జీవితం మీ చేతిలోనే ఉంది. నన్ను పెంచుతారో,తెంచుతారో మీ ఇష్టం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎలా ఆశీర్వదిస్తారో మీ ఇష్టం. నాకు మీసం తిప్పాలని బాగా కోరిక. కానీ మా నెల్లూరులో ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు నేను మీసం తిప్పితే తట్టుకోలేరు. పౌరుషాల గడ్డ పల్నాడుకి వచ్చా, ఇక్కడ మీసం మేలేసి చెబుతున్నా. పైన ఉన్న ఆ దేవుడ్ని, తాడేపల్లిలో ఉన్న జగనన్ననీ నమ్మి వచ్చా. భగవంతుడు, మీరు ఏ రాత రాస్తారో చూడాలి.” అని ఆయన అన్నారు.