NTV Telugu Site icon

Yatra-2 Motion Poster: నేను విన్నాను, నేను ఉన్నాను.. యాత్ర-2 మోషన్ పోస్టర్‌ రిలీజ్‌!

Yatra 2 Motion Poster

Yatra 2 Motion Poster

Yatra-2 Movie Motion Poster Released: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా ‘యాత్ర’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో మలయాళ హీరో మమ్ముట్టి హీరోగా వచ్చిన యాత్ర సినిమా మంచి విజయం సాధించింది. మహీ వి రాఘవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కింది. సీక్వెల్‌ కూడా ఉంటుందని డైరెక్టర్ రాఘవ్‌ గతంలోనే ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఇటీవలే విడుదల చేశారు. నేడు వైఎస్‌ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా యాత్ర-2కు సంబంధించి మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

1 నిమిషం 11 సెకండ్ల నిడివి గల యాత్ర-2 మోషన్‌ పోస్టర్‌.. వైఎస్‌ రాజశేఖర రెడ్డి గారి చేతి విగ్రహం సీన్‌తో ఆరంభం అవుతుంది. ‘నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా నమస్తే.. నమస్తే..’ అనే మాటలతో మోషన్‌ పోస్టర్‌ ప్రారంభం అవుతుంది. ఇక ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు చెప్పిన మాటలతో వీడియో ముగుస్తుంది. మోషన్‌ పోస్టర్‌లో తండ్రీకొడుకులు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి పాదయాత్ర, వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీ తదితర అంశాలను యాత్ర 2లో డైరెక్టర్ మహీ వి రాఘవ్‌ చూపించనున్నారని తెలుస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మోషన్‌ పోస్టర్‌లో ఫేస్ సరిగా కనిపించకపోవడంతో క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. శివ మేక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read: Disadvantages Of Yogurt: పెరుగుతో పాటు వీటిని అస్సలు తినొద్దు.. భారీ మూల్యం తప్పదు!

Also Read: SIIMA Awards 2023: సైమా వేడుకలకు ముహూర్తం ఫిక్స్.. హోస్ట్‌గా టాలీవుడ్ హీరో!

 

Show comments