ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. ఫస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్ జైస్వాల్ ఇంగ్లాండ్ గడ్డపై 144 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. బౌలర్లకు చుక్కలు చూయించాడు. దీంతో యశస్వి జైస్వాల్ తన టెస్ట్ కెరీర్‌లో రెండవ సెషన్‌లో ఐదవ సెంచరీని పూర్తి చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ క్రికెట్‌లో ఇది జైస్వాల్‌కు మూడవ సెంచరీ. ఈ సెంచరీతో కొత్త రికార్డులను సృష్టించాడు.
READ MORE: Mumbai: రన్నింగ్ ట్రైన్‌లో డోర్ దగ్గర నిలబడి.. రక్తం వచ్చేలా కొట్టుకున్న యువతులు(వీడియో)
టెస్ట్ క్రికెట్‌లో యశస్వి జైస్వాల్ పేరిట ఓ ప్రత్యేకమైన రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ రెండింటిలోనూ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మొదటి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఐదవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా.. ఇంగ్లాండ్‌లో సెంచరీ సాధించిన రెండవ అతి పిన్న వయస్కుడైన భారత బ్యాట్స్‌మన్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు.
READ MORE: Bhadrakali Bonalu: భద్రకాళి అమ్మవారి బోనాలు వాయిదా.. రాజకీయ విభేదాలతోనే పోస్ట్‌పోన్!
ఇంగ్లాండ్‌లో టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాళ్లు..
సయ్యద్ ముష్తాక్ అలీ – 21 సంవత్సరాల 221 రోజులు (సంవత్సరం 1936)
యశస్వి జైస్వాల్ – 23 సంవత్సరాల 174 రోజులు (సంవత్సరం 2025)
వీరేంద్ర సెహ్వాగ్ – 23 సంవత్సరాల 292 రోజులు (2002)
విజయ్ మర్చంట్ – 24 సంవత్సరాల 287 రోజులు (సంవత్సరం 1936)
