NTV Telugu Site icon

Yashasvi Jaiswal: అదే నా బ్యాటింగ్‌పై చాలా ప్రభావం చూపింది: యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal Close

Yashasvi Jaiswal Close

Yashasvi Jaiswal Says I try to play just how team needs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సత్తాచాటిన యశస్వి జైస్వాల్.. భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. తన టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ చేసి అదరగొట్టిన యశస్వి.. టీ20లో తొలి హాఫ్ సెంచరీ బాదాడు. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన యశస్వి తన మీద నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన భారత మేనేజ్‌మెంట్, కెప్టెన్ హార్దిక్‌పాండ్యాకు ధన్యవాదాలు తెలిపాడు.

యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ… ‘పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందనిపించినా పరుగులు రాబట్టడం కష్టమైంది. నా మీద నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ హార్దిక్‌ పాండ్యాకు ధన్యవాదాలు. ఇదే నా బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది. జట్టు నమ్మకాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్‌ చేశా. జట్టు అవసరాలకు తగ్గట్టుగా రన్స్ చేయడమే నా లక్ష్యం. పవర్‌ ప్లేలో ధాటిగా పరుగులు చేస్తే.. ఆపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. పరిస్థితులను అర్థం చేసుకుని ఆడితే పరుగులు అవే వస్తాయి. నా లక్ష్యం ఎప్పుడూ వేగంగా పరుగులు సాధించడమే’ అని అన్నాడు.

Also Read: Woman Kidnapped Married Boyfriend: మరో పెళ్లి చేసుకున్న ప్రియుడు.. కిడ్నాప్ చేసి తాళికట్టించుకున్న ప్రియురాలు!

‘జాసన్ హోల్డర్, ఒబెడ్ మెకాయ్‌ బౌలింగ్‌ను ఐపీఎల్‌లో ఎదుర్కోవడం నాకు బాగా ఉపయోగపడింది. శుబ్‌మన్‌ గిల్‌తో అద్భుతమైన భాగస్వామ్యం నిర్మించడం ఆనందంగా ఉంది. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ ఆడాలని ముందే నిర్ణయించుకున్నాం. దాంతో వేగంగా పరుగులు వచ్చాయి. గిల్‌ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఆటలో భాగస్వామ్యాన్ని నిర్మించడం చాలా ముఖ్యం. ఈ వేడిలో ఇక్కడకు వచ్చి మాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నా’ అని యశస్వి జైస్వాల్ చెప్పాడు.