NTV Telugu Site icon

IND vs BAN: రెండో టెస్టులో ఘన విజయం.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్!

Team India Test Team

Team India Test Team

కాన్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో భారత్ సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 95 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోయి అందుకున్న‌ది. దీంతో భార‌త్ 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించి.. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ రోహిత్ (8), గిల్ (6) విఫలమైనప్పటికీ.. జైస్వాల్ (51), కోహ్లీ (29 నాటౌట్) రాణించారు. ఈ సిరీస్‌ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

వర్షం కారణంగా రెండు రోజుల పాటు ఆట సాగలేదు. తొలి రోజు కేవలం 35 ఓవర్లే పడ్డాయి. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ భారత్ దూకుడుగా ఆడి.. ఊహించని ఫలితంను అందుకుంది. బంగ్లాను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్‌ చేసి అద్భుత విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులు చేయగా.. భారత్ 285/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ 95 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ టెస్ట్ మ్యాచులో భారత్ టీ20 క్రికెట్ ఆడింది.

Also Read: Mahindra Thar ROXX: అక్టోబర్ 3 నుంచి ‘థార్ రాక్స్’ బుకింగ్స్.. ఎగబడుతున్న జనం!

అద్భుత విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దాంతో స్వదేశంలో వరుసగా 18వ సిరీస్‌ భారత్‌ ఖాతాలో చేరింది. యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలవగా.. రవిచంద్రన్ అశ్విన్‌ ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును అందుకున్నాడు. ఈ సిరీస్‌ విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన టాప్‌ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఇకపై ఆడే ఎనిమిది టెస్టుల్లో మూడు గెలిచినా.. భారత్‌ టాప్‌-2లో ఉంటుంది.