Yashasvi Jaiswal Record: టీ20ల్లో కనివినీ ఎరుగని రికార్డు.. మన యశస్వి జైస్వాల్ సొంతం!
- తొలి బంతికే 13 రన్స్
- తొలి బ్యాటర్‌గా రికార్డుల్లో యశస్వి
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal smashes world record in T20Is: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కనివినీ ఎరుగని రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే 13 రన్స్ రాబట్టిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన ఐదో టీ20లో యశస్వి ఈ ఫీట్ నమోదు చేశాడు. 21 ఏళ్ల టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ప్రస్తుతం ఈ రికార్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐదో టీ20లో మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. మొదటి ఓవర్‌ను జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా వేశాడు. మొదటి బంతిని నోబాల్‌గా వేయగా.. యశస్వి జైస్వాల్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. బంతి నడుము కంటే ఎత్తులో రావడంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. ఫ్రీ హిట్‌గా వేసిన బంతిని జైస్వాల్ స్ట్రైట్‌గా సిక్సర్ బాదాడు. దాంతో ఒక బంతికే 13 పరుగులు లభించాయి. దాంతో తొలి బంతికే 13 రన్స్ రాబట్టిన తొలి బ్యాటర్‌గా యశస్వి చరిత్రకెక్కాడు.
Also Read
- Mohan Bhagwat: "నేటి తరం దారి తప్పలేదు".. సీజేపీ నిరసనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
- Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ 'మనీ రూల్స్'.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
- CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా?.. కేంద్రానికి CJP డెడ్‌లైన్.. ఢిల్లీలో హై అలర్ట్!
- ఏపీలో SIR పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు 'అన్ కలెక్టబుల్'గా గుర్తింపు.. తుది ఓటరు జాబితా విడుదల అప్పుడే.!
Also Read: Carlos Alcaraz: 11 ఏళ్ల వయసులోనే చెప్పా: కార్లోస్ అల్కరాస్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 రన్స్ చేసింది. సంజూ శాంసన్ (58; 45 బంతుల్లో 1×4, 4×6) హాఫ్ సెంచరీ చేయగా.. శివమ్ దూబే (26; 12 బంతుల్లో 2×4, 2×6) రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని రెండు వికెట్లు పడగొట్టాడు. చేధనలో జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. మైయర్స్ (34; 32 బంతుల్లో 4×4, 1×6) టాప్ స్కోరర్. ముకేశ్ (4/22), దూబె (2/25) రాణించారు. దూబే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక వాషింగ్టన్ సుందర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు.
Yashasvi Jaiswal became the first batter in history to score 13 runs on the 1st ball of a T20i. 🌟pic.twitter.com/98j63xmtGu
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024
తాజావార్తలు
-
Soft Foods for Seniors: దంతాలు లేని వారికి ఏ ఆహారం మంచిది? సులభంగా తినగలిగే పోషకాహారాల పూర్తి జాబితా
-
Salman Khan: ట్రోల్స్‌కు సిక్స్‌ప్యాక్‌తో సమాధానం.. 60 ఏళ్లకూ సల్మాన్ స్టామినా ఇదే!
-
Mohan Bhagwat: “నేటి తరం దారి తప్పలేదు”.. సీజేపీ నిరసనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
-
Samsung Galaxy F70 Pro: సామ్ సంగ్ గెలాక్సీ F70 ప్రో.. 6000mAh బ్యాటరీ, Snapdragon 6 Gen 3 చిప్సెట్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!