‘కేజీయఫ్’ సినిమాలతో కన్నడ హీరో యశ్‌కి పాన్ ఇండియా స్టార్ డమ్ వచ్చింది. స్టార్ డమ్ వచ్చింది అని యశ్ ఎలా పడితే అలా సినిమాలు చేయడం లేదు. ఆచితూచి అడుగులేస్తున్న యశ్.. కాస్త గ్యాప్ తర్వాత ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారని టాక్. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2025 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
టాక్సిక్ తర్వాత యశ్ మరో కొత్త సినిమా ప్రకటించలేదు కానీ.. బాలీవుడ్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రామాయణ్‌లో మాత్రం నటించనున్నట్టుగా టాక్. నితీష్ తివారి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రామాయణ్ తెరకెక్కుతోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాలో.. రావణుడిగా యశ్ నటించనున్నాడు. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కావడంతో ఈ పాత్రలో నటిస్తున్నందుకు గాను యశ్ ఏకంగా రూ.200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే విలన్‌గా ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న హీరోగా యశ్ రికార్డ్ క్రియేట్ చేసినట్టే.
Also Read: Pushpa 2: బాలీవుడ్ స్టార్ హీరోలకు బిగ్ టార్గెట్ ఇచ్చిన పుష్పరాజ్!
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోల రెమ్యునరేషన్ వంద, రెండొందల కోట్ల వరకు ఉంటోంది. ఇటీవల ఇండస్ట్రీ హిట్ కొట్టిన పుష్ప 2 కి అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడట. కానీ ఇప్పుడు విలన్‌గా యశ్‌కు 200 కోట్లంటే ఇదొక రికార్డ్ అనే చెప్పొచ్చు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. యశ్ తదుపరి సినిమా కోసం మాత్రం ఆయన అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి యశ్ నటిస్తున్న టాక్సిక్, రామాయణ్ ఎలా ఉంటాయో చూడాలి.