NTV Telugu Site icon

Yarlagadda VenkatRao: గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు విస్తృత పర్యటన..

Gannavaram

Gannavaram

విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో గురువారం నాడు సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగాయి. గన్నవరం మండలం బూతిమిల్లిపాడు సర్పంచ్ పేరం సుబ్బారావు, గెడ్డం రంగారావు, సత్తెనపల్లి అజయ్, పందేటి చిరంజీవి, పెండ్యాల వసంతరావు, కె. అశోక్, యస్. దినేష్, కాజా రామకృష్ణ, లంగితోటి కిరణ్ కుమార్, సత్తెనపల్లి రవీంద్ర, సత్తెనపల్లి లోకేష్, యస్. మధు, యస్. రాజబాబు, సవలం తాతాబ్బాయి తదితరులు పార్టీలో చేరగా యార్లగడ్డ వెంకట్రావు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Read Also: Namburu Sankara Rao: ప్రచారంలో జోరు పెంచిన నంబూరు శంకరరావు..

ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో గన్నవరంలో రాబోయే ఎన్నికల్లో అతిపెద్ద విజయం సాదించబోతున్నామన్నారు. ప్రతి రోజు ప్రజల సమస్యలు, ప్రజా స్పందన తెలుసుకుంటూ .. రాబోయే ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో వివరిస్తున్నామని తెలిపారు. ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని దానికి ఉదాహరణగా గతంలో ఎప్పుడు టీడీపీకి ఓటు వేయనివారు సైతం ఏకంగా టీడీపీ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహంచాలని ఆయన పేర్కొన్నారు. మూడు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని, అసాంఘీక శక్తులను ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంభంపాటి వెంకటేశ్వరరావు, బొప్పన హరికృష్ణ, సర్నాల బాలాజీ, పరచూరి నరేష్, మేడేపల్లి రమ, మండవ రమ్యకృష్ణ, కంచర్ల సూర్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.