Yarlagadda VenkatRao: వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే టీడీపీ- జనసేన కలిసి పని చేయాలని యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. ఇక, విజయవాడలోని యార్లగడ్డ గ్రాండియర్ కళ్యాణ మండపంలో బుధవారం నాడు సాయంత్రం ఏర్పాటు చేసిన గన్నవరం నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి యార్లగడ్డ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీడీపీతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన అధినేత పిలుపు మేరకు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు పని చేయాలన్నారు. గ్రామ స్థాయిలో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం చేస్తూ.. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే రోజుల్లో టీడీపీ శ్రేణులతో పాటు జనసైనికులకు సైతం తగిన గౌరవం ఉంటుందని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు.
Read Also: IPL 2024: ముంబై ఇండియన్స్ ఎంత కసితో ఉందో అర్థమవుతోంది: అశ్విన్
కాగా, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, జిల్లా కార్యదర్శి బండ్రెడ్డి రవి, జిల్లా సంయుక్త కార్యదర్శి గంధం గోవర్ధన్, చిమట రవివర్మ, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ పోలిశెట్టి పవన్, విజయవాడ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు పొదిలి దుర్గారావు, ఉపాధ్యక్షులు పసుపులేటి భాస్కర్, కొడిమెల రవి, గన్నవరం మండల పార్టీ అధ్యక్షుడు పచ్చిపాల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు కోట వెంకట దుర్గాప్రసాద్, పసుమర్తి చంద్రశేఖర్, బాపులపాడు మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే శివ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు హైటెక్ నాని, భుక్తా సమీర్, ఉంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడు బర్మా భువన భాస్కర్, ఉపాధ్యక్షులు శెట్టి రాజేష్, మహిళా విభాగం నాయకులు మేకల స్వాతి, చింతజలల్లు కుమారి, శిరీష, దుంపల సంధ్య, ముద్దా జయరాణి, మునీషా భేగం, వర్రి జయలక్ష్మి, సత్యవతితో పాటు తదితరులు పాల్గొన్నారు.